Shankar , Ram Charan క్రేజీ కాంబో

Thursday,February 11,2021 - 03:26 by Z_CLU

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న క్రేజీ కాంబినేషన్స్ లో శంకర్ – రామ్ చరణ్ కాంబో ఒకటి. అవును రామ్ చరణ్ తో శంకర్ ఓ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించనున్నాడట. ఈ భారీ బడ్జెట్ కాంబో సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని సమాచారం. ఇటివలే చరణ్ తో  సినిమాకు సంబంధించి శంకర్ స్క్రిప్ట్ డిస్కషన్ చేశాడట.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు త్వరలోనే ఎనౌన్స్ చేయబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ తో శంకర్ ‘ఇండియన్ 2’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయ్యాకే రామ్ చరణ్ తో శంకర్ సినిమా ఉండొచ్చు. ఈ లోపు రామ్ చరణ్ RRR తో పాటు ‘ఆచార్య’ సినిమాలు ఫినిష్ చేయాల్సి ఉంటుంది.  ఈ క్రేజీ కాంబో సినిమాకు సంబంధించి ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో ? చరణ్ తో శంకర్ ఎలాంటి సందేశాత్మక సినిమా తీస్తాడో ? తెలియాల్సి ఉంది.

Also Read  చరణ్ కెరీర్ లో బెస్ట్ రోల్