ఆర్యగా మారబోతున్న చరణ్

Monday,September 12,2016 - 03:07 by Z_CLU

బన్నీ హీరోగా ఆర్య సినిమా వచ్చింది. ఆ తర్వాత ఆర్య-2 కూడా చేశాడు. మరి చరణ్ ఆర్యగా మారడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా…? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. అల్లు అర్జున్ ను ఆర్యలో అల్టిమేట్ లవర్ బాయ్ గా చూపించిన సుకుమార్… త్వరలోనే రామ్ చరణ్ ను కూడా తిరుగులేని ప్రేమికుడిగా ప్రొజెక్ట్ చేయబోతున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా పక్కా అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి డేట్స్ కూడా దాదాపుగా ఫిక్స్ చేశారు. తాజా సమాచారం ప్రకారం… అక్టోబర్ చివరి వారంలో సుకుమార్-చరణ్ సినిమా ప్రారంభం అవుతుంది. నవంబర్ రెండో వారం నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక కథ విషయానికొస్తే… చరణ్ తో పూర్తిస్థాయి ప్రేమకథాచిత్రం చేయబోతున్నట్టు సుకుమార్ ఇప్పటికే ప్రకటించాడు. కాకపోతే… ఇందులో కూడా సుకుమార్ స్టయిల్ లో ట్విస్ట్ లు, లాజిక్ లు ఉండబోతున్నాయి. హీరోయిన్ ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తారు.