SIDDHA చరణ్ కెరీర్ లోనే బెస్ట్ !

Monday,January 18,2021 - 01:40 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి , కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ACHARYA‘ సినిమాలో మెగా పవర్ స్టార్ Ram Charan  ముఖ్యమైన క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుండి  సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ పై కోకాపేట్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో  కీలక సన్నివేశాలు తీస్తున్నారు. సినిమాలో ఉన్న కీ రోల్ ను చరణ్ తోనే చేయించాలని ఇన్ని నెలలు పట్టుబట్టిన కొరటాల ఎట్టకేలకు చరణ్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.

RamCharan-as-siddha_in_acharya

సిద్ద రోల్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలుస్తుందని టీం చెప్తుంది. సినిమాలో చరణ్ కొంత సేపే ఉన్నప్పటికి క్యారెక్టర్ లో హై లెవెల్ ఇంటెన్స్ ఉంటుందని, దాన్ని స్క్రీన్ పై చూసినప్పుడు కచ్చితంగా అభిమానుల రోమాలు నిక్కపోడుస్తాయని అంటున్నారు. నిజానికి తండ్రి చిరుతో చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఇద్దరు కలిసి కాసేపు స్క్రీన్ పై కనిపిస్తూ ఎంటర్టైన్ చేయాలనేది చిరు సతీమణి చరణ్ తల్లి సురేఖ కోరిక. దాన్ని దృష్టిలో పెట్టుకునే చరణ్ కోసం కొరటాల సెపరేట్ గా ఓ క్యారెక్టర్ డిజైన్ చేసి  స్క్రిప్ట్ రాసుకున్నాడు.

‘ఆచార్య’ లో సిద్ద రోల్ ఎలా ఉంటుంది ? చరణ్ ని కొరటాల ఏ రేంజ్ లో చూపిస్తాడు ..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.