ఉగాది రోజు సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న చెర్రీ

Monday,March 06,2017 - 12:45 by Z_CLU

టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న మోస్ట్ ఇంటరెస్టింగ్ మెగా టాపిక్ చెర్రీ సుకుమార్ సినిమా. 80’s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమా, అందునా సుకుమార్ సొంతంగా రాసుకున్న స్టోరీలైన్… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాపై హైప్ పెరగడానికి బోలెడన్నీ రీజన్స్ కనిపిస్తాయి. కానీ ఇంటరెస్టింగ్ న్యూస్ ఏంటంటే టాలీవుడ్ స్ట్రీట్స్ లో ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా అంతే స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది.

 

మణిరత్నం డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించనున్నాడనే టాక్ ఇప్పటిది కాదు, లాంగ్ లాంగ్ బ్యాక్ నుండి నడుస్తున్నదే. కాకపోతే ఈ కాంబో కూడా ఉగాది రోజున ఓ సర్ ప్రైజింగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారనే బజ్, పెద్దగా కష్టపడకుండానే కాన్సంట్రేషన్ ని తన వైపు తిప్పుకుంటుంది.

 

నిజానికి ఈ అనౌన్స్ మెంట్ కి సంబంధించి రామ్ చరణ్ కానీ, మణిరత్నం టీం కానీ ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. ఈ లోపు ఫ్యాన్స్ ఉగాది పండగ చుట్టూ భారీ ఎక్స్ పెక్టేషన్స్ నే పెట్టేసుకుంటున్నారు. మరి ఈ బజ్ లో ఎంత నిజముందో తెలియాలంటే సినిమా యూనిట్ స్పందించే దాకా వెయిట్ చేయాల్సిందే.