నేననుకున్నది అల్లు అర్జున్ చేశాడు – రామ్ చరణ్

Tuesday,May 01,2018 - 05:19 by Z_CLU

మే 4 న గ్రాండ్ గా రిలీజవుతుంది అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దానికి తోడు రీసెంట్ గా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ సినిమా గురించి చెప్పిన మాటలు మెగా ఫ్యాన్స్ ని మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాయి.

“జస్ట్ ట్రైలర్ చూస్తే సరిపోతుంది బన్నికి ఎంత డెడికేషన్ ఉందో… చిన్నప్పటి నుండి బన్నికి ఎంటర్ టైన్ చేయడం అలవాటే. ఆ ఎంటర్ టైన్ మెంట్ కోసం ఎంత కష్టమైనా భరిస్తాడు. బన్ని పడ్డ కష్టం సినిమాలో కనిపిస్తుంది. ఇంత పవర్ ఫుల్  మిలిటరీ ఆఫీసర్ గా నటించాలని నేను చాలా రోజులుగా అనుకుంటున్నా… నేననుకున్నది బన్ని సాధించేశాడు. వక్కంతం వంశీ గారు రాసిన ప్రతి కథ బ్లాక్ బస్టరే. అలాంటి గొప్ప విజన్ ఉన్న వంశీ గారి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డెఫ్ఫినేట్ గా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా’ నని చెప్పుకున్నాడు రామ్ చరణ్.

బన్ని తన కరియర్ లోనే నెవర్ సీన్ బిఫోర్ గెటప్ లో మోస్ట్ అగ్రెసివ్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.