ఆయన గొప్పదనం ఇప్పుడే తెలుసుకుంటున్నా - చరణ్

Monday,March 02,2020 - 12:17 by Z_CLU

తెలుగు సినిమా చరిత్రలో మెగా స్టార్ ప్రయాణం ఒక అధ్యాయనం. స్వయం కృషితో ఒక్కో మెట్టు ఎక్కి మెగా స్టార్ గా ఎదిగిన చిరంజీవి జీవితం అందరికీ ఓ స్ఫూర్తి. అందుకే చిరు జీవితం గురించి తాజాగా సీనియర్ పాత్రికేయుడు ‘మెగా స్టార్ ది లెజెండ్‘ అనే పుస్తకాన్ని రాసి లాంచ్ చేసారు.

ఈ పుస్తక ఆవిష్కరణకు అతిథిగా వచ్చిన రామ్ చరణ్ తన తండ్రి చిరు గురించి ఎమోషనల్ గా మాట్లాడారు” చిన్నతనంలో నాన్నగారు చేసిన సినిమాల గురించి,ఆయన పడిన కష్టం గురించి నాకేమాత్రం తెలియదు. మేము ఉదయం నిద్ర లేవక ముందే ఆయన వెళ్ళిపోయేవారు.ఆయన షూటింగ్ నుండి వచ్చే సరికి మేం పడుకునే వాళ్ళం. ఇలా జరిగేది. అందుకే ఆయన గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోయాం. ఇప్పుడిప్పుడే ఆయన సినిమాలు , పడిన కష్టం ఎదిగిన తీరు ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నా. నాకు తెలిసింది కొంతే అని ఈ పుస్తకం చదివాక అర్థమైంది. నాన్న గారి గురించి ఈ పుస్తకం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని ఆయనకీ నేనింకాస్త దగ్గరవుతానని భావిస్తున్నా. అందుకు గానూ వినాయక రావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక ‘ఖైదీ 150’ ఆయన నాకు ఓ కొత్త కోణంలో అర్థమయ్యారు. నాన్న గురించి ఎంతో మంది దర్శకులు , నిర్మాతలు చెప్పినా నేను స్వయంగా సినిమా చేసినప్పుడే ఇంకా ఎక్కువగా తెలుసుకున్నాను. అరవై పదులు దాటాక కూడా ఆ సినిమా షూటింగ్ కోసం ఆయన ఐదింటికి లేవడం ఓ గంట పాటు వ్యాయామం చేయడం ఆరింటి కల్లా రెడీ అయిపోయి. ఏడింటికి లొకేషన్ లో ఉండి ఏడున్నర కి ఫస్ట్ షాట్ లో పాల్గొనే వారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయన్ని మినట్ టూ మినట్ ఫాలో చేశాను. ఆ ఒక్క సినిమాతో ఆయన గురించి ఎంతో తెలుసుకున్నా. ఇవాళ బహుశా అవకాశం ఉంటే ఒక గంట ఆలస్యంగా రమ్మంటారా డైరెక్టర్ అని ఆశ పడుతుంటాను. కానీ గంట ముందే రావొచ్చా అని ఆయన ఆలోచిస్తారు. అదీ చిరంజీవి గారు.” అని అన్నాడు.