బావ మరదలు గా చరణ్- సమంత ?

Sunday,October 08,2017 - 12:16 by Z_CLU

‘రంగస్థలం1985’ సినిమాతో ఫస్ట్ టైం జోడీ కట్టారు చరణ్ – సమంత. సుకుమార్ డైరెక్షన్ లో 1985 బాగ్రాప్ లో విలేజ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీరిద్దరి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయా..అనే క్యూరియాసిటీ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. అయితే రీసెంట్ గా ఈ సినిమాలో చరణ్ సమంత క్యారెక్టర్స్ పై ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో చరణ్ సమంత బావ- మరదలుగా నటిస్తున్నారనేది ఆ వార్త.

విలేజ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నప్పటికీ ఈ సినిమాలో చరణ్ – సమంత లవ్ ట్రాక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని…తన మేకింగ్ స్టైల్ తో లవ్ సీన్స్ తీయడంలో ఎక్స్పర్ట్ అయిన సుకుమార్ వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ తో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాడని, ఇక బావ మరదలుగా వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందని ఇంసైడ్ టాక్. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి, అనసూయ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో మెరవబోతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.