రికార్డ్ బ్రేకింగ్ రేస్ లో రామ్ చరణ్ రంగస్థలం

Friday,April 06,2018 - 06:16 by Z_CLU

ఓవర్ సీస్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది రంగస్థలం. రిలీజై వారం కావస్తున్నా, ఏ మాత్రం క్రేజ్ తగ్గని ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్ళ విషయంలోను ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు ఓవర్ సీస్ లో రిలీజైన సినిమాల ఓవరాల్ కలెక్షన్స్ ని కేవలం వారం రోజుల్లో కొల్లగొట్టి 4 వ స్థానంలో నిలిచింది రామ్ చరణ్ రంగస్థలం.

 

1 – బాహుబలి 2 – ది కంక్లూజన్ – $2,01,17,274
2 – బాహుబలి – $6,997,636
3 – శ్రీమంతుడు – $2,891,742
4 – రంగస్థలం – $2,800,000
5 – అ..ఆ… – $2,449,174
6 – ఖైదీ నం 150 – $24,45,043
7 – ఫిదా  – $2,066,937
8 – అజ్ఞాతవాసి – $2,065,527.00
9 – నాన్నకు ప్రేమతో – $2,022,392
10 – అత్తారింటికి దారేది – $1,897,541

కేవలం వారం రోజుల్లో $2,800,000 వసూలు చేసి అ…ఆ.. ఓవరాల్ కలెక్షన్స్ రికార్డు బ్రేక్ చేసిన రంగస్థలం, శ్రీమంతుడు రికార్డ్ ని కూడా ఈజీగా క్రాస్ చేసి థర్డ్ ప్లేస్ ని ఆక్యుపై చేయడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు. 1980 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రంగస్థలం, ఇటు క్లాస్, అటు మాస్ ఆడియెన్స్ విపరీతంగా నచ్చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్.