రివర్ బ్యాక్ డ్రాప్ సెట్స్ లో రామ్ చరణ్ రంగస్థలం

Wednesday,August 30,2017 - 01:13 by Z_CLU

1985 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న రామ్ చరణ్ రంగస్థలం ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మ్యాగ్జిమం సినిమా షూటింగ్ గోదావరి జిల్లాల్లో కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్, ప్రస్తుతం హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉంది.

రంగస్థలం కథ మ్యాగ్జిమం నదీ తీర ప్రాంతాల్లో నడుస్తుంది కాబట్టి సుకుమార్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా  రివర్ బ్యాక్ డ్రాప్ లో న్యాచురల్ గా ఉండేలా సెట్స్ వేయించాడు. ప్రస్తుతం నైట్ ఎఫెక్ట్ లో షూటింగ్ జరుగుతున్న ఈ షెడ్యూల్ లో సమంతా, రామ్ చరణ్ కాంబినేషన్ లో సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

ఈ షెడ్యూల్ లో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి కూడా పాల్గొననున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.