డబ్బింగ్ స్టేజ్ లో రామ్ చరణ్ రంగస్థలం

Tuesday,March 06,2018 - 02:38 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘రంగస్థలం’. రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ పనులు కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. 1985 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 30 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబులా మెస్మరైజ్ చేయబోతున్నాడు. దానికి తోడు రీసెంట్ గా రివీల్ అయిన సమంతా లుక్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం, స్పెషల్ గా విలేజ్ సెట్ ని వేసి ఈ సినిమాను తెరకెక్కించాడు సుకుమార్.

ఈ నెల 18 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వైజాగ్ లో సెలెబ్రేట్ చేయనున్న సినిమా యూనిట్, ఈ ఈవెంట్  లో  సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేయనున్నారు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.