రామ్ చరణ్ ఒక్కడే...

Tuesday,August 27,2019 - 10:02 by Z_CLU

‘సైరా’ ఆలోచన ఇప్పటిది కాదు… ఈ సినిమా చేయలన్న ఆలోచన మెగాస్టార్ కి పదేళ్ళ క్రితమే వచ్చింది. కానీ సినిమా సెట్స్ పైకి రాకపోవడానికి ఒకే ఒక్క రీజన్… బడ్జెట్. భారీ బడ్జెట్ తో సినిమా చేయాలన్న ఆలోచనతో పుట్టికొచ్చిన సినిమా కాదు సైరా… కథే ఆ స్థాయి గ్రాండియర్ ని డిమాండ్ చేస్తుంది. అందుకే చిరు.. ఈ సినిమాను ఆల్ మోస్ట్ పక్కన పెట్టేశారు. ఇన్నాళ్ళకు ఈ సినిమా పాసిబుల్ అయిందంటే అది కేవలం రామ్ చరణ్ వల్లే.

టాలీవుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఒక్కటే కాదు… మార్కెటింగ్ బారియర్స్ కూడా మారిపోయాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ జస్ట్ తెలుగు ఆడియన్స్ కే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పరిచయమే. దానికి తోడు మెగాస్టార్ చరిష్మా.. అందుకే కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగాడు చెర్రీ.. టాలీవుడ్ లోనే ఫస్ట్ టైమ్ తండ్రి సినిమాని నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు.

మెగాస్టార్ కమ్ బ్యాక్ సినిమాని ‘కొణిదెల ప్రొడక్షన్స్’పై నిర్మించాడు చెర్రీ. సంవత్సరాల గ్యాప్ తరవాత మెగాస్టార్ సినిమా చేస్తున్నాడు కాబట్టి రామ్ చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నారంతా. ఓ వైపు హీరోగా బిజీగా ఉంటూ నిర్మాతగా.. అందునా చిరంజీవి సినిమాలకు నిర్మాతగా వ్యవహరిచాలంటే చాలా అనుభవం కావాలని అనుకున్నారంతా… కానీ చెర్రీ సింపుల్ గా.. ‘సైరా’ లాంటి బిగ్గెస్ట్ హిస్టారికల్ సినిమా బాధ్యతలనే సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ అడ్మినిస్ట్రేషన్ ‘సైరా’ షూటింగ్ లో ఎలా ఉందనేది ఫ్యాన్స్ కి అంతగా తెలీకపోయినా, చెర్రీ సినిమాని బాలీవుడ్ లో ప్రమోట్ చేస్తున్న తీరు చూస్తుంటే చెర్రీ జస్ట్ మెగాపవర్ స్టారే కాదు… మెగా పవర్ ప్రొడ్యూసర్ అనిపిస్తుంది.