నాన్నకు ప్రేమతో

Wednesday,January 04,2017 - 12:00 by Z_CLU

మెగా స్టార్ దాదాపు 8 ఏళ్ల తర్వాత రి ఎంట్రీ ఇస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘ఖైదీ నంబర్ 150 ‘ రిలీజ్ కి రెడీ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తర్వాత ఓ రెండు మూడు నెలలు గ్యాప్ తీసుకొని తన 151 వ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు మెగా స్టార్.

 ‘ఖైదీ నంబర్ 150 ‘ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్స్ లో కొందరికి తన ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వబోతున్నాడు చిరు. అయితే ప్రెజెంట్ 150 వ సినిమాను తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో చేసిన మెగా స్టార్ తన 151 వ సినిమాను కూడా మళ్ళీ ఇదే బ్యానర్ లో చేయబోతున్నాడట. ఇక మొన్నటి వరకూ ఆ సినిమాకు నిర్మాతలుగా అల్లు అరవింద్ తో పాటు మరి కొందరి పేర్లు వినిపించగా ఫైనల్ గా ఆ సినిమాను చెర్రీ ఏ నిర్మించబోతున్నాడు. ఇటీవలే ఈ విషయం పై స్పందించిన రామ్ చరణ్ నాన్న 151 సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లోనే ఉంటుందని ఆ సినిమాకు డైరెక్టర్,టెక్నీషియన్స్ గురించి ‘ఖైదీ నంబర్ 150 ‘ రిలీజ్ తర్వాతే డిసైడ్ అవుతామని అనౌన్స్ చేసాడు . తొలి సారి గా మెగా స్టార్ కోసం నిర్మాతగా మారిన చెర్రీ నాన్నకు ప్రేమతో అంటూ మరో సారి ఇలా నిర్మాత గా మారబోతున్నాడు..