‘కౌబాయ్’ గా రామ్ చరణ్

Wednesday,June 05,2019 - 10:04 by Z_CLU

ఇది రామ్ చరణ్ కొత్త సినిమా కాదు… మెగా ఫ్యాన్స్ లో కొత్తగా క్రియేట్ అయిన డిమాండ్. ప్రస్తుతం ఆఫ్రికాలో హాలీడే ఎంజాయ్ చేస్తున్నాడు చెర్రీ.. గత కొన్ని రోజులుగా ఈ ట్రిప్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫోటోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి… అయితే రీసెంట్ గా బయటికి వచ్చిన ఒక ఫోటో మాత్రం ఫ్యాన్స్ లో చెర్రీ ని కౌబాయ్ చూడాలన్న డిమాండ్ ని క్రియేట్ చేస్తుంది.

ఇప్పటివరకు చెర్రీ చేసిన ప్రతి సినిమాలో కొద్దో గొప్పో వేరియేషన్స్ ఉండేలా చూసుకుంటూనే ఉంటాడు. కానీ కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా గురించి ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ జస్ట్ ఒక్క రాండమ్ క్లిక్ కే రామ్ చరణ్ ఇలా ఉంటే, ఇంకా పక్కా ప్లాన్డ్ గా సినిమా చేస్తే మెగా పవర్ స్టార్ అదిరిపోవడం గ్యారంటీ అనే అభిప్రాయం ఫ్యాన్స్ లో క్రియేట్ అవుతుంది.

ప్రస్తుతం ‘RRR’ సినిమా సెట్స్ పై బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. మరి ఈ సినిమా తరవాత ఫ్యాన్స్ కోరిక మేరకు చెర్రీ నిజంగానే కౌబాయ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా గురించి ఆలోచిస్తాడా..? ఈ అవకాశాన్ని వాడుకుని చెర్రీ డేట్స్ కోసం ట్రై చేస్తున్న డైరెక్టర్స్ ఈ గ్యాప్ లో కౌ బాయ్ బ్యాక్ డ్రాప్ లో కొత్త కథను రాసేసుకుంటారా..?

ఏం జరుగుతుందో చూడాలి… నిన్నా మొన్నటి వరకు చెర్రీ ‘అల్లూరి సీతారామరాజు’ గా ఎలా ఉండబోతున్నాడో అని క్రియేట్ అయి ఉన్న క్యూరియాసిటీకి, ఇప్పుడీ కౌబాయ్ గెటప్ తోడై ఫ్యాన్స్ లో చెర్రీ హాట్ టాపిక్ గా మారాడు. చూడాలి.. చెర్రీ మైండ్ లో ఏం నడుస్తుందో…