సెట్స్ పైకి రామ్ చరణ్ సినిమా

Friday,January 20,2017 - 11:46 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ సినిమా ప్రీ ప్రొడక్షన్ మ్యాగ్జిమం ప్యాకప్ అయింది. జనవరి 30 నుండి సినిమా సెట్స్ పైకి రానుంది. ఖైదీ నం 150 తో ప్రొడ్యూసర్ గా మారిన చెర్రీ, ఆ సినిమా సక్సెస్ మీట్స్ లాంటి ఫార్మాలిటీస్ ని, మ్యాగ్జిమం జనవరి 30 కల్లా కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అందుకే ఫుల్ ఫ్లెజ్డ్ గా రెడీ అని సుకుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మెగా పవర్ స్టార్.

మైత్రి మేకర్స్ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫ్రెష్ లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సుకుమార్ సొంతంగా కథ రాసుకున్నాడు. సుక్కు కరియర్ లో ఆర్య తరవాత రాసుకున్న కథ ఇది కావడంతో, ఈ సినిమాపై న్యాచురల్ గానే కాన్సంట్రేషన్ మళ్ళుతుంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. నాన్నకు ప్రేమతో లాంటి బ్లాక్ బస్టర్  తరవాత వన్ ఇయర్ గ్యాప్ తీసుకుని మరీ సెట్స్ పైకి వచ్చిన సుక్కు, ఈ సారి ఆర్య లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించడం గ్యారంటీ అని టాలీవుడ్ లో టాక్.