సుకుమార్ పై చెర్రీ హోప్స్

Sunday,December 25,2016 - 01:00 by Z_CLU

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎప్పట్నుంచో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో గ్రాండ్ హిట్ అందుకోవాలని ఉంది. అందుకే కృష్ణవంశీ డైరెక్షన్ లో ‘గోవిందుడు అందరి వాడేలే’ అనే విలేజ్ ఎంటర్టైనర్ సినిమా చేశాడు. అయితే ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా మెగాస్టామినాను చూపించలేకపోయింది.

  అందుకే మరోసారి అలాంటి కథతోనే గ్రాండ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు రామ్ చరణ్. ఇందు కోసం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో జత కట్టబోతున్నాడు మెగా పవర్ స్టార్. లేటెస్ట్ గా ధృవ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చెర్రీ నెక్స్ట్ సినిమాను జనవరి నుంచే సెట్స్ పై పెట్టాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం లొకేషన్స్ వేటలో పడ్డ సుక్కు. ఈస్ట్ గోదావరిలో కోనసీమ , కాకినాడ పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆల్ మోస్ట్ లొకేషన్స్ అన్నీ ఒకే చేసేశాడని సమాచారం. ధృవతో బ్లాక్ బస్టర్ అందుకున్న చెర్రీ.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో గ్రాండ్  హిట్ అందుకోవాలన్న కోరికను సుకుమార్ సినిమాతో నెరవేర్చుకుంటాడని ఆశిద్దాం.