'ధృవ' వచ్చేస్తున్నాడు

Saturday,November 19,2016 - 03:36 by Z_CLU

రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధృవ’ విడుదలపై అనుమానాలు వీడిపోయాాయి. ఈ మూవీ రిలీజ్ డేేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 2న వస్తుందని అంతా అనుకున్నారు. ఒక దశలో సినిమా ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడిందనే పుకార్లు కూడాా వచ్చాయి. రిలీజ్ డేేట్ ఎనౌన్స్ మెంట్ తో మేకర్స్.. ఈ రూమర్స్ కు చెక్ చెప్పారు.

ఇక ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. హిపాప్ తమీజాా అందించిన ట్యూన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెలాఖరుకు లేదా వచ్చేనెల మొదటివారంంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేయాలనే ఆలోచనలో ఉన్నారు. ధృవ సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.