మెగాస్టార్ 151 డైరెక్టర్ ని కన్ఫం చేసిన చెర్రీ

Thursday,February 02,2017 - 01:40 by Z_CLU

మెగాస్టార్ 151 వ సినిమా కన్ఫం అయింది. ఖైదీ నం 150 లాంటి జక్కాస్ మాస్ ఎంటర్ టైనర్ తరవాత అవుట్ స్టాండింగ్ స్టైలిష్ లుక్స్ లో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయాలని డిసైడ్ అయిన మెగాస్టార్ తన తరవాతి సినిమా పగ్గాలను సురేందర్ రెడ్డి చేతికి అప్పగించారు. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ కన్ఫం చేశాడు.

chiru-surender-zee-cinemalu

రామ్ చరణ్ కరియర్ లోనే లైఫ్ టైం హైలెట్ అయ్యే రేంజ్ లో ధృవ ని ప్రెజెంట్ చేసిన సురేందర్ రెడ్డి, మెగాస్టార్ కోసం కోసం అవుట్ స్టాండింగ్ స్క్రిప్ట్ ని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కాన్సెప్ట్ ఏమై ఉంటుందనే డీటేల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు కానీ, ఈ కన్ఫర్మేషన్ మాత్రం మెగా ఫ్యాన్స్ లో హై ఎండ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది.

ఏ మాత్రం లేట్ చేయకుండా సినిమాని సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్, ఈ సినిమాకి ‘ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి’ అని టైటిల్ కూడా కన్ఫం చేసేశారు. ఇక హీరోయిన్, విలన్ లాంటి డీటేల్స్ చిన్న చిన్న గ్యాప్స్ తో అనౌన్స్ కానున్నాయి.