పెద్ద దర్శకులను లైన్ లో పెట్టుకున్న రామ్ చరణ్

Saturday,April 21,2018 - 12:06 by Z_CLU

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘రంగస్థలం’ తరవాత బోయపాటి సినిమాతో రెడీ అవుతున్నాడు చెర్రీ. ఈ అల్ట్రా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తరవాత రామ్ చరణ్ ఇమ్మీడియట్ గా రాజమౌళి సినిమాతో సెట్స్ పై ఉన్నాడు. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ మల్టీస్టారర్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉంది.

అయితే రంగస్థలం లో ‘చిట్టిబాబు’ లా అన్ని క్యాటగిరీస్ ని ఇంప్రెస్ చేసిన చెర్రీ, ఓ వైపు బోయపాటి, మరో వైపు రాజమౌళి సినిమాల కోసం ప్రిపేర్ అవుతూనే ‘భరత్ అనే నేను’ సినిమాతో  అవుట్ స్టాండింగ్ బ్లాక్ బస్టర్ ని జెనెరేట్ చేసిన కొరటాల శివకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రామ్ చరణ్ కోసం మరో ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ ని అప్పుడే రెడీ చేసుకున్నాడు కొరటాల.

ఇక ప్రస్తుతం సెట్స్ పై ఉన్న బోయపాటి సినిమాలో చెర్రీ, విశ్వరూపం ఎలా ఉండబోతుందోనన్న క్యూరాసిటీ ఫ్యాన్స్ లో క్రియేట్ అయి ఉంది. ఈ సినిమాలో చెర్రీ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది.