పవన్ చిన్న పిల్లాడేం కాదు..

Tuesday,January 03,2017 - 07:08 by Z_CLU

ఖైదీ నంబర్-150 ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పై నిన్నటి వరకు చాలామందికి చాలా డౌట్స్ ఉండేవి. బెజవాడలో ఫంక్షన్ రద్దవ్వడంతో, మళ్లీ ఎప్పుడు పెడతాారు.. ఎప్పుడు పెడతాారు లాంటి ప్రశ్నలు రెయిజ్ అయ్యాయి. అయితే ఇలాంటి అనుమానాలకు వెంటనే చెక్ పెట్టే మెగాకాంపౌండ్, ఈసారి కూడా అంతే ఫాస్ట్ గా రియాక్ట్ అయింది. ఖైదీ నంబర్-150కి నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్.. స్వయంగా ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యాడు.

c1hd3kzxeaatzi9
ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను 7వ తేదీన గుంటూరు-విజయవాడ మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ గ్రాండ్ లో నిర్వహిస్తామని రామ్ చరణ్ ప్రకటించాడు. ఈ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఈరోజు, అల్లు అరవింద్, జెమినీ కిరణ్ ప్రత్యేకంగా హాయ్ ల్యాండ్ కు వెళ్లారు. ఇక ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకరత్న దాసరి నారాయణరావును ఆహ్వానించినట్టు రామ్ చరణ్ తెలిపాడు. అటు బాబాయ్ పవన్ కల్యాణ్ ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని… అయితే పవన్ వస్తారా రారా అనేది తనకు తెలియదని చెర్రీ తెలిపాడు. పవన్ ఏం చిన్నపిల్లాడు కాదని, రావాలా వద్దా అనే నిర్ణయం అతనే తీసుకుంటాడని చరణ్ కామెంట్ చేశాడు. ఖైదీ నంబర్-150 సినిమా 11న థియేటర్లలోకి వస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ ప్రకటించాడు.