Ram Charan ఆ లోటు తీర్చబోతున్న మెగాపవర్ స్టార్

Saturday,March 26,2022 - 01:22 by Z_CLU

Ram Charan coming up with three films this year ?

దాదాపు మూడేళ్ళ తర్వాత రామ్ చరణ్ ‘RRR’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూడేళ్ళు మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా చరణ్ సినిమాను మిస్ అయ్యారు. అందుకే ఈ ఏడాది తన నుండి మూడు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడట చెర్రి. ప్రస్తుతం ‘RRR’ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న చరణ్ నెక్స్ట్ ‘ఆచార్య’ తో నెలల గ్యాప్ లోనే  మళ్ళీ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

తండ్రి మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చరణ్ ‘ఆచార్య’లో సిద్ద పాత్రతో మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. సమ్మర్ స్పెషల్ గా ఆ సినిమాతో  రానున్న చరణ్ ఈ సినిమాతో పాటు ఇయర్ ఎండింగ్ లో శంకర్ తో చేస్తున్న మరో సినిమాను కూడా రిలీజ్ కి రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఫాస్ట్ ఫేజ్ లో షూటింగ్ జరుగుతుంది. ఇటివలే రాజమండ్రి లో ఓ భారీ షెడ్యుల్ ఫినిష్ చేసుకొచ్చారు. హైదరాబాద్ లో చరణ్ , మిగతా యాక్టర్స్ తో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా షూట్ ఫినిష్ చేసి ఏడాది చివరిలో  రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే దీపావళి లేదా క్రిస్మస్ స్పెషల్ గా RC15 సినిమా థియేటర్స్ లోకి రావొచ్చు. అదే నిజమైతే చరణ్ ఈ ఏడాది మూడు సినిమాలతో మూడేళ్ళ గ్యాప్ ని మర్చిపోయేలా చేస్తాడన్నమాట.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics