రామ్ చరణ్ – ముంబై కా హీరో

Friday,March 22,2019 - 12:43 by Z_CLU

‘RRR’ లో చెర్రీ సరసన ముంబై భామ ఆలియా భట్ నటిస్తుంది. ఈ సినిమాలో సీత క్యారెక్టర్. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ అనిపించుకుంటున్న ఆలియా భట్ ఈ సినిమాతో టాలీవుడ్ కి దగ్గర కానుంది. ఇక ఆడియెన్స్ విషయానికి వస్తే, NTR, రామ్ చరణ్ లు ఈ సినిమాలో ఎలా కనిపిస్తారో అనే క్యూరియాసిటీ ఏ స్థాయిలో ఉందో, ఈ ముంబై భామ చెర్రీ సరసన… అందునా 1920 బ్యాక్ డ్రాప్ లో…. అచ్చ తెలుగమ్మాయిలా ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో చూసేయాలన్న ఆత్రం కూడా అదే స్థాయిలో ఉంది.

ముంబై భామలతో స్టెప్పులేసి ముంబై కా హీరో అనిపించుకోవడం చెర్రీకి ఇదే ఫస్ట్ టైమ్ కాదు… గతంలో ‘జంజీర్’ సినిమాలో ప్రియాంక చోప్రాతో నటించాడు. ఈ సినిమా ఎంతగా సక్సెస్ అయిందనేది పక్కన పెడితే, ఈ సినిమాతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్ అనిపించుకుంటున్న ప్రియాంక చోప్రా ఫిల్మోగ్రఫీ లో టాలీవుడ్ సినిమా ఉండేలా చేశాడు. ఈ సినిమాతో చెర్రీ స్టామినా బాలీవుడ్ లో కూడా అంతే స్ట్రాంగ్ గా రిజిస్టర్ అయింది.

అంతెందుకు రీసెంట్ గా ‘వినయ విధేయ రామ’ లో చెర్రీ సరసన నటించిన ‘కైరా అద్వానీ’ కేరాఫ్ అడ్రస్ కూడా బాలీవుడే కదా. ఈ ముద్దుగుమ్మ జస్ట్ 2 సినిమాలే అని కండిషన్ పెట్టుకుని, ఇలావచ్చి అలా వెళ్ళిపోయిందనిపించినా, వినయ విధేయ రాముని సరసన పర్ఫెక్ట్ సీత అనిపించుకుంది.

చెర్రీ డెబ్యూ మూవీ ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ కూడా సిల్వర్ స్క్రీన్ కి చెర్రీ తో ఇంట్రడ్యూస్ అయినా, కేరాఫ్ అడ్రస్ మాత్రం ఖచ్చితంగా బాలీవుడే. ఇప్పటికే 10 కి పైగా హిందీ సినిమాల్లో నటించిన ఈ భామ, నటిగా పరిచయమైంది అల్టిమేట్ గా చెర్రీ తోనే. ఇప్పుడు ఆలియా భట్ హీరోగా నటిస్తున్న చెర్రీ, RRR తో మరోసారి ముంబై కా హీరో అనిపించుకోనున్నాడు.