హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన చెర్రీ

Wednesday,June 13,2018 - 11:10 by Z_CLU

మొన్నటివరకు బ్యాంకాక్ లో బిజీగా గడిపాడు చరణ్. బోయపాటి సినిమాకు సంబంధించి అక్కడ 2 వారాల పాటు ఏకథాటిగా షూటింగ్ చేశారు. అది కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగొచ్చిన చరణ్.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని రేపట్నుంచి మరో షెడ్యూల్ షురూ చేశాడు.

హైదరాబాద్ లో చరణ్-బోయపాటి కొత్త సినిమా షెడ్యూల్ రేపట్నుంచి షురూ కానుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ షెడ్యూల్ కూడా 15 రోజుల పాటు సాగుతుంది. మరీ ముఖ్యంగా ఈ షెడ్యూల్ లో చరణ్, స్నేహ, ప్రశాంత్ మధ్య ఫ్యామిలీ ఎపిసోడ్ తీయబోతున్నారు

గ్యాప్ లేకుండా బోయపాటి సినిమాను పూర్తిచేయాలనేది చెర్రీ ప్లాన్. ఎందుకంటే ఆ వెంటనే రాజమౌళి సినిమాకు డేట్స్ ఇచ్చాడు కాబట్టి. అందుకే బోయపాటి సినిమాకు గ్యాప్స్ ఇవ్వడం లేదు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే పాటల కోసం యూరోప్ వెళ్తారు. దసరా కానుకగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది టార్గెట్.