రామ్ చరణ్ బర్త్ డే హంగామా ప్రారంభం

Monday,March 26,2018 - 02:45 by Z_CLU

మెగా పవర్ స్టార్ బర్త్ డే హంగామా బిగిన్ అయింది. 27 మార్చి 1985 న పుట్టిన రామ్ చరణ్ రేపు తన 33 వ పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకోనున్నాడు. అయితే అంతకంటే ముందే మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ లో చెర్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ బిగిన్ అయ్యాయి.

ఇప్పటికే తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ నుంచి ఖరీదైన గిఫ్ట్ అందుకున్నాడు చెర్రీ. దానికి తోడు మెగా ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మెగా బ్లడ్ డొనేషన్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. అందుకు అభినందనలు చెప్తూ, చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు.

‘రక్తం లభించక ఎవరూ చనిపోకూడదు’ అనే చిరంజీవి ఆశయాన్ని రెండు దశాబ్దాలకు పైగా మీరు చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే’ అని ఫ్యాన్స్ ని అభినందించిన మెగాస్టార్ ఇంతకన్నా గొప్ప గిఫ్ట్  రామ్ చరణ్ కి  ఇంకేదీ ఉండదన్నారు.