కౌబాయ్ గా మెగాపవర్ స్టార్ ?

Saturday,October 29,2016 - 03:40 by Z_CLU

వెండితెరపై కౌబాయ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన కౌబాయ్ క్యారెక్టర్లను తెలుగుతెరపైకి తీసుకొచ్చిన ఘనత ఘట్టమనేని కృష్ణకే చెల్లుతుంది. ఆ తర్వాత చిరంజీవి,మహేష్ బాబు లాంటి ఎంతోమంది స్టార్స్ కౌబాయ్ క్యారెక్టర్లు ట్రైచేశారు. అయితే ఇప్పటితరం మాత్రం ఆ తరహా పాత్రలు, కథలకు దూరంగానే ఉంటూ వచ్చింది.

      ఇప్పుడు మెగాకాంపౌండ్ లో మరోసారి కౌబాయ్ స్టోరీలైన్ హల్ చల్ చేస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వద్దకు ఈ తరహా కథ ఒకటి వచ్చినట్టు తెలుస్తోంది. ఓ భారీ రిఫరెన్స్ తో చెర్రీని కలుసుకున్న ఓ ఔత్సాహిక దర్శకుడు… ఈ కథ వినిపించాడట. అయితే ఇందులో పూర్తిగా కౌబాయ్ క్యారెక్టర్ లేదట. కొంత భాగం మాత్రమే ఆ ఛాయల్లో ఉంటే… చెర్రీ మాత్రం కౌబాయ్ క్యారెక్టర్ ను పూర్తిస్థాయిలో ఎలివేట్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకొని రమ్మన్నాడట. అయితే చరణ్ కు ఆ కథ వినిపించిన కుర్రాడు ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.