చిట్టిబాబు మెచ్చిన గీతగోవిందం

Friday,August 17,2018 - 01:29 by Z_CLU

‘గీతగోవిందం’ జస్ట్ ఆడియెన్స్ నే కాదు స్టార్స్ ని కూడా మెస్మరైజ్ చేస్తోంది. సినిమా రిలీజైన దగ్గరి నుండి సోషల్ మీడియాలో ఈ సినిమాకి ఓ రేంజ్ లో అప్రీసియేషన్స్ తో ముంచెత్తుతున్నారు.  ఇప్పుడీ లిస్ట్ లోకి చిట్టిబాబు కూడా చేరాడు. రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ చరణ్, గీతగోవిందం సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ పెర్ ఫెక్ట్ ఛేంజ్-ఓవర్ చూపించాడంటూ మెచ్చుకున్న రామ్ చరణ్, దేవరకొండతో పాటు రష్మిక పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉందని పోస్ట్ చేశాడు. వీళ్ల పెర్ఫార్మెన్స్ తో పాటు మ్యూజిక్ డైరక్టర్ గోపీసుందర్, డైరక్టర్ పరశురాంను అభినందించాడు.

గీతగోవిందం సినిమాను ఇప్పటికే రాజమౌళి, మహేష్ బాబు లాంటి పలువురు ప్రముఖులు మెచ్చుకున్నారు. సినిమాను ప్రత్యేకంగా చూసిన మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండను అభినందించాడు. ఈ వీకెండ్ గీతగోవిందం యూనిట్ కు బన్నీ ఓ పెద్ద పార్టీ కూడా ఇవ్వబోతున్నాడట.