రామ్ చరణ్, కైరా అద్వానీ మళ్ళీ జతగా...?

Saturday,August 03,2019 - 11:02 by Z_CLU

రామ్ చరణ్, కైరా అద్వానీ జంటగా మరో సినిమా…? ప్రస్తుతానికి అలాంటిదేం లేదు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇంకో సినిమాలో నటిస్తే చూడాలనే కోరిక ఫ్యాన్స్ లో అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ విషయంలో ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్ నడిచింది.

తన కో స్టార్స్ తో  ఫ్రెండ్లీగా ఉండటం చెర్రీకి కొత్తేం కాదు. మహా అయితే షూటింగ్స్ లో బిజీగా ఉంటే తప్ప, ఏ చిన్న అకేషన్ కైనా అటెండ్ అవుతాడు. అలా రీసెంట్ గా ముంబైలో కైరా అద్వానీ బర్త్ డే సెలెబ్రేషన్స్ కి కూడా అటెండ్ అయ్యాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి జంటగా ఫోటోలు కూడా దిగారు… అవే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

‘వినయ విదేయ రామ’ లో చెర్రీ సరసన నటించిన కైరా, ఇంకో తెలుగు సినిమాలో కనిపించలేదు. దానికి బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవ్వడమే రీజన్. అయితే మెగా ఫ్యాన్స్ లో మాత్రం కైరా అద్వానీ చుట్టూ భారీ డిమాండ్ ఉంది.

రామ్ చరణ్, కైరా అద్వానీ ఇంకో సినిమాలో కలిసి నటించాలన్న కోరిక మెగా ఫ్యాన్స్ లో గట్టిగా ఉంది. ప్రస్తుతం RRRతో బిజీగా ఉన్నాడు చెర్రీ. ఈ సినిమాలో కైరా కి అవకాశం లేదు. కాబట్టి ఫ్యూచర్ సినిమాల్లో అన్నీ కుదిరితే మళ్ళీ కైరా ని ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. చూడాలి మరీ… మెగా ఫ్యాన్స్ కోరిక ఎన్నాళ్ళకు… ఏ సినిమాతో తీరుతుందో…