బాహుబలి-2ను ప్రత్యేకంగా మెచ్చుకున్న చెర్రీ

Wednesday,May 03,2017 - 01:39 by Z_CLU

‘బాహుబలి-2’ ఏప్రిల్ 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తూ వసూళ్ల సునామి సృష్టిస్తుంది.. లేటెస్ట్ గా ఈ సినిమా చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా బాహుబలి-2పై స్పందించారు. బాహుబలి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని కితాబిచ్చాడు చెర్రీ. రాజమౌళి ఊహ, క్రియేషన్ తో గ్రాండియర్ విజువల్ ట్రీట్ గా తెరకెక్కిన బాహుబలి-2 సినిమా.. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉందంటున్నాడు చరణ్.

మన డార్లింగ్ ప్రభాస్ నటుడిగా ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తో ఎట్రాక్ట్ చేశాడని… అలాగే రానా కూడా తన పర్ఫార్మెన్స్ తో బెస్ట్ అనిపించుకున్నాడని మెచ్చుకున్నాడు. ఇక అనుష్క, రమ్య కృష్ణ, సత్య రాజ్, తమన్నా తన నటనతో కట్టిపడేశారని పొగిడేసిన చెర్రీ… ఓవరాల్ గా బాహుబలి-2 సినిమా ప్రతి ఫిలిం మేకర్ కి స్ఫూర్తినిచ్చేలా ఉందన్నాడు.