సుకుమార్ సొంత సినిమాకి రామ్ చరణ్ ప్రమోషన్

Thursday,July 13,2017 - 06:10 by Z_CLU

ఓ వైపు చెర్రీ తో ‘రంగస్థలం’ సినిమాకి డైరెక్షన్ చేస్తూనే, సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న ‘దర్శకుడు’ సినిమా ప్రొడక్షన్ పనులను కూడా అంతే ఇంటరెస్టింగ్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు సుకుమార్. మొన్నటికి మొన్న రకుల్ ప్రీత్ సింగ్, సమంతా చేతుల మీదుగా ఫస్ట్ 2 సింగిల్స్ ని రిలీజ్ చేసిన సుక్కు, ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా గ్రాండ్ గా జూలై 15 న  ఆడియో రిలీజ్ చేయబోతున్నాడు.

హరిప్రసాద్ జక్కా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అశోక్, ఈషా జంటగా నటించారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలతో ఎట్రాక్ట్ చేస్తున్న సాయి కార్తీక్ మ్యూజిక్, తక్కిన పాటలపై కూడా అవే రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేశాయి. దానికి తోడు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ‘కుమారి 21 F’ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఎంటర్ టైన్ చేయడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.