Ram-Boyapati Movie షూటింగ్ అప్ డేట్స్

Wednesday,October 26,2022 - 03:18 by Z_CLU

Ram -Boyapati Movie shooting updates

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ పోతినేని ఓ కంప్లీట్ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ ఏడెకరాల్లో వేసిన స్పెషల్ సెట్ లో సాంగ్ షూట్ జరుగుతుంది. హీరో రామ్ పోతినేని, బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వసి రౌతెల ల మీద ఐటెం సాంగ్ షూట్ చేస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేస్తున్న ఈ సాంగ్ సినిమాకు హైలైట్ కానుందని అంటున్నారు.

ఈ సాంగ్ కోసం తమన్ కంపోజ్ చేసిన మాస్ సాంగ్ థియేటర్స్ లో విజిల్స్ వేయిస్తుందని టాక్ వినిపిస్తుంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ సాంగ్ షూట్ నేటితో పూర్తవనుంది. రెండు మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్ళీ యూనిట్ రామోజీ ఫిలిం సిటీ లో యాక్షన్ సీక్వెన్స్ మొదలు పెట్టబోతున్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఈ ఫైట్ కంపోజ్ చేస్తారని సమాచారం.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics