ఎనర్జిటిక్ స్టార్ రామ్ బర్త్ డే స్పెషల్

Tuesday,May 15,2018 - 10:03 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ టాలీవుడ్ లో స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకున్నాడు రామ్ పోతినేని. కంప్లీట్ లవర్ బాయ్ లా చేసినా నచ్చేస్తాడు, కాస్త డిఫెరెంట్ గా ఉంటుందిలే అని మాస్ సినిమా చేసినా ఇరగదీసేస్తాడు. డ్యాన్స్ అయినా ఇమోషనల్ సీన్ అయినా ఎనర్జీ మాత్రం ఏ మాత్రం డ్రాప్ కానివ్వడు. 1988 లో సరిగ్గా ఇదే రోజు పుట్టిన రామ్ ఈ రోజు తన 30 వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా జీ సినిమాలు స్పెషల్ స్టోరీ…

గ్రాండ్ ఎంట్రీ : రిలీజైన వారం రోజుల్లోనే రామ్ కి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా.  2006 లో Y.V.S చౌదరి డైరెక్షన్ లో అల్టిమేట్ యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, టాలీవుడ్ లో మరో స్టార్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడన్న క్లారిటీ ఇచ్చేసింది.

 

కంప్లీట్ స్టార్ : రామ్ కమర్షియల్ హీరోగా ట్రాన్స్ ఫామ్ అవ్వడానికి పెద్దగా టైమ్ పట్టలేదనే చెప్పాలి. 2007 లో రిలీజైన ‘జగడం’ దగ్గరి నుండి బిగిన్ అయితే ఆ తరవాత రిలీజైన రెడీ, మస్కా, గణేష్, రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలు, రామ్ ని కంప్లీట్ స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసేశాయి.

 

బ్లాక్ బస్టర్ హీరో :  2011 లో రిలీజైన ‘కందిరీగ’ రామ్ కరియర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ లా నిలిచింది. ఇక ఈ సినిమా తరవాత రిలీజైన ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమా, రామ్ లోని సాఫ్ట్ ఆంగిల్ ని ఎలివేట్ చేసినా, 2013 లో రిలీజైన ‘ఒంగోలు గిత్త’ సినిమా రామ్ లోని మాస్ అవతారాన్ని ఎలివేట్ చేసింది.

స్టైల్ చేంజ్ : 2015 లో రిలీజైన ‘పండగ చేసుకో’ సినిమా సక్సెస్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన రామ్, ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ లో ఫీల్ గుడ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్స్ ట్రెండ్ ని రీక్రియేట్ చేశాడు.

సర్ ప్రైజింగ్ ట్రాన్స్ ఫమేషన్ : 2016 లో రిలీజైన ‘హైపర్’ లో మరోసారి తన పర్ఫామెన్స్ స్టామినాని ఎలివేట్ చేశాడు రామ్. తండ్రిని అతిగా ఇష్టపడే కొడుకులా న్యాచురల్ పర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేసిన రామ్, ఆ తరవాత రిలీజైన ‘ఉన్నది ఒకటే జిందగీ’ లో కంప్లీట్ న్యూ లుక్ లో, సరికొత్తగా మెస్మరైజ్ చేశాడు.

హలో గురూ ప్రేమకోసమే : ప్రస్తుతానికి ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ అయితే రివీల్ కాలేదు కానీ దర్శకుడు త్రినాథ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. నిన్న రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేసింది.

సినిమా సినిమాకి డిఫెరెన్స్ మెయిన్ టైన్ చేస్తూ, అన్ని క్యాటగిరీస్ ఎట్రాక్ట్ చేసే సినిమాలు చేస్తూ కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న రామ్, మరెన్నో హైట్స్ కి రీచ్ అవ్వాలని, ఇలాంటి బర్త్ డే లు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.