కొత్త సినిమా ఎనౌన్స్ చేసిన రామ్

Monday,October 28,2019 - 05:01 by Z_CLU

ఇస్మార్ట్ శంకర్ తో డబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్, షార్ట్ గ్యాప్ తర్వాత కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. ఓవైపు ఇస్మార్ట్ వంద రోజుల పండగను ఫ్యాన్స్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్న వేళ.. రామ్ కొత్త సినిమా ప్రకటన కూడా రావడంతో అభిమానుల ఆనందం డబుల్ అయింది. రామ్ కొత్త సినిమా పేరు RED

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ పై రామ్ ఈ సినిమా చేయబోతున్నాడు. గతంలో కిషోర్ తిరుమల, రామ్ కాంబోలో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలొచ్చాయి. ఇప్పుడీ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతోంది RED

టైటిల్ తో పాటు మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. షార్ట్ హెయిర్ స్టయిల్, రఫ్ గడ్డంతో రామ్ నిల్చొన్న లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ డిజైన్ చూస్తుంటే ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అనే విషయం అర్థమౌతూనే ఉంది.

ఇస్మార్ట్ శంకర్ కు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన మణిశర్మ, రామ్ కొత్త సినిమాకు కూడా వర్క్ చేయబోతున్నాడు. స్రవంతి మూవీస్ లో మణిశర్మకు ఇదే ఫస్ట్ సినిమా. నవంబర్ 16 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ చేస్తారు. హీరోయిన్ ను త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు.