పూరి రిపీటెడ్ హీరోల లిస్టులో రామ్

Tuesday,July 23,2019 - 10:02 by Z_CLU

రామ్… పూరి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్ ‘ అంచనాలకు మించి ఎంటర్టైన్ చేస్తుంది. అందుకే రీసెంట్ గా ఈ సినిమా సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’ ని అనౌన్స్ చేశాడు దర్శకుడు. దీంతో రామ్ పూరి రిపీటెడ్ హీరోల లిస్టులోకి చేరాడు…

రవితేజ : ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ తో బిగిన్ అయిన ఈ ఇద్దరి కాంబినేషన్ ఎనిసార్లు వచ్చినా సక్సెస్ ఫుల్ అనిపించుకుంది. ఈ సినిమా తరవాత ‘ఇడియట్’, అమ్మా నాన్న తమిళ అమ్మాయి’… సినిమాలు రవితేజని సక్సెస్ ఫుల్ గా స్టార్ హీరోల వరసలో నిలబెడితే, కొన్నాళ్ళ గ్యాప్ తరవాత ‘నేనింతే’, ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలు చేశారు.

మహేష్ బాబు : వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పోకిరి’ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ సెన్సేషనల్ సక్సెస్ తరవాత వీళ్ళిద్దరూ మరోసారి జట్టు కట్టి ‘బిజినెస్ మెన్’ చేశారు… సూపర్ స్టార్ కూడా పూరి రిపీట్ చేసిన హీరోనే…

నాగార్జున : పూరి నాగ్ తో కలిసి చేసిన మొదటి సినిమా ‘శివమణి’. ఈ కాంబినేషన్ ఈ ఒక్క సినిమాతో ఆగలేదు… మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ‘సూపర్’ సినిమా చేశారు. నాగ్ ని ఫ్యాన్స్ అప్పట్లో ఎలా చూడాలనుకున్నారో ఆ మిర్రర్ ఇమేజ్ ని ప్రెజెంట్ చేశాడు పూరి…

NTR : ‘ఆంధ్రావాలా’ సినిమా అటు NTR కి, ఇటు పూరికి కూడా చేదు అనుభవమే. కానీ 2015 లో రిలీజైన ‘టెంపర్’ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

పవన్ కళ్యాణ్ : ఈ మాసివ్ డైరక్టర్ కరియర్ బిగిన్ అయిందే పవన్ కళ్యాణ్ తో.. ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా లాంచ్ అయ్యాడు. ఆ తరవాత కొన్నాళ్ళకు పవన్ కళ్యాణ్ తో ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ చేశాడు.

ప్రభాస్ : వీళ్ళిద్దరూ కలిసి చేసిన ‘సినిమా బుజ్జిగాడు’. ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా మళ్ళీ పూరి డైరెక్షన్ లోనే ‘ఏక్ నిరంజన్’ చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్.