రవితేజ తో రకుల్ ?

Sunday,December 24,2017 - 04:33 by Z_CLU

లేటెస్ట్ గా ‘రాజా ది గ్రేట్’ సినిమాతో ఐయామ్ బ్యాక్ అంటూ సూపర్ హిట్ అందుకున్న రవి తేజ నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా రవి తేజ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనల్ చేసారని తెలుస్తుంది. ఇటీవలే కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో రూపొందిన ‘రారండోయ్ వేడుక చేద్దాం’ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ తో ఆకట్టుకున్న రకుల్ లేటెస్ట్ గా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం.

ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను రామ్ తాళ్ళూరి నిర్మించనున్నాడు.