నిర్మాతగా మారతా కానీ...

Tuesday,May 23,2017 - 06:07 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ ఎవరంటే ఎవరైనా క్షణం ఆలోచించకుండా రకుల్ ప్రీత్ సింగ్ వైపు చూస్తారు. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ క్షణం ఖాళీ లేకుండా సినిమాలు  చేస్తుంది. ఈ నెల 26 న నాగ చైతన్య తో రారండోయ్ సినిమాలో ‘భ్రమరాంబ’ క్యారెక్టర్ లో ఎట్రాక్ట్ చేయనున్న రకుల్, సూపర్ స్టార్ మహేష్ సరసన స్పైడర్ లోను ‘డాక్టర్’ లా ట్రీట్ మెంట్ చేయడానికి రెడీ అవుతోంది.

హార్డ్ వర్క్ చేయడం న్యాచురల్ హ్యాబిట్ అని చెప్పుకునే రకుల్, ఆక్టింగ్ తో పాటు సినిమా ప్రొడక్షన్ కూడా చాలా  ఇంట్రెస్ట్ అని మనసులో మాట చెప్పుకుంది. కాకపోతే యాక్టర్ గా ఈ రేంజ్ లో బిజీ గా ఉన్నప్పుడు మళ్ళీ  ప్రొడక్షన్ అంటూ డైవర్ట్ అయిపోతే అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి, ప్రస్తుతానికి ఆ ఇంట్రెస్ట్ ని అటక ఎక్కించేశాను అని చెప్పుకుంది రకుల్ ప్రీత్ సింగ్.

హై ఎండ్ ఫ్యాన్ ఫాలోయిన్ ని క్రియేట్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం RRVC సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీ గా ఉంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ ‘భ్రమరాంబ’ ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుందని ఎక్జైటెడ్ గా ఉంది ఈ ఫ్యూచర్ ప్రొడ్యూసర్.