స్పీడ్ తగ్గించిన రకుల్

Tuesday,November 21,2017 - 11:40 by Z_CLU

ఇన్నాళ్లు గ్యాప్ లేకుండా సినిమాలు చేసింది. ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవాలనుకుంటోంది. అందుకే ఇప్పటివరకు మరో తెలుగు సినిమాకు కాల్షీట్లు కేటాయించలేదు రకుల్.

“”నాలుగేళ్ల నుంచి రాత్రిపగలు పనిచేస్తున్నాను. దాదాపు 10 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేశాను. ఈ ఇయర్ ఎండింగ్ లో బ్రేక్ తీసుకోవాలని ముందే అనుకున్నాను. లేదంటే తొందరగా ముసలిదాన్ని అయిపోతాను. కనీసం నెల రోజులు రెస్ట్ తీసుకుంటాను. ఒకేసారి 3-4 స్టోరీలు నచ్చితే అన్నీ చేయాలనుకుంటాను. రాత్రిపగలు కష్టపడతాను. కానీ నా తల్లిదండ్రులు నన్ను కూర్చోబెట్టి మరీ బ్రేక్ తీసుకోమని చెప్పారు. సినిమాల సంఖ్య కంటే క్వాలిటీపై దృష్టి పెట్టమని సూచించారు.” తాజా ఇంటర్వ్యూలో రకుల్ ఈ మేటర్ బయటపెట్టింది

తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై మాట్లాడిన రకుల్.. హిందీలో చేసిన అయ్యారి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. తెలుగులో ఓ 2 సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని, త్వరలోనే వెల్లడిస్తానంటోంది రకుల్.