కమల్ సినిమాలో రకుల్ ?

Sunday,July 21,2019 - 02:00 by Z_CLU

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నాడు కమల్ హాసన్. ఇటివలే ప్రారంభమైన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో రకుల్ కూడా హీరోయిన్ గా నటించనుందని సమాచారం. సినిమాలో సిద్దార్థ్ కూడా ఓ రోల్ చేస్తున్నాడు. సిద్దు కమల్ కి మనవడిగా కనిపిస్తాడట. రకుల్ ను సిద్దుకి హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తుంది.

శంకర్ సినిమాలో హీరోయిన్ అంటే కొంత క్రేజ్ ఉంటుంది. పైగా సినిమా తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. మరి విధంగా చూస్తే రకుల్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.ప్రస్తుతానికైతే ఈ విషయంపై రకుల్ నుండి కానీ… మేకర్స్ నుండి కానీ ఎలాంటి క్లారిటీ లేదు. త్వరలోనే ఓ సందర్భం చూసుకొని అనౌన్స్ చేస్తారని టాక్.