రకుల్ చేతిలో అరడజను సినిమాలు...

Saturday,November 05,2016 - 09:00 by Z_CLU

‘బ్రూస్ లీ’,’నాన్నకు ప్రేమతో’,’సరైనోడు’ వంటి బడా సినిమాలతో స్టార్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతున్న రకుల్ ఇంకాస్త జోరు పెంచింది. ప్రస్తుతం ఈ అమ్మడు అరడజను సినిమాలతో కథానాయికగా బిజీ అయిపోయింది.

‘బ్రూస్ లీ’ చిత్రం లో రామ్ చరణ్ తో కలిసి నటించిన ఈ భామ మరో సారి ‘ధృవ’ సినిమాలో చెర్రీ తో జతకట్టింది. ఈ చిత్రం తో పాటు మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం లో కథానాయికగా నటిస్తున్న రకుల్ సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’, బోయపాటి-బెల్లంకొండ సినిమా, నాగ చైతన్య తో కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్న సినిమాల్లో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు హిందీ లో ‘షిమ్లా మిర్చి’ అనే సినిమాలో కూడా నటిస్తూ కథానాయికగా అలరించడానికి రెడీ అవుతుంది. మరి యంగ్ హీరోలు, టాప్ హీరో లు తేడా లేకుండా అరడజను సినిమాలతో బిజీ గా ఉన్న ఈ పంజాబీ భామ వచ్చే ఏడాది కూడా మరిన్ని సినిమాలతో బిజీ కానుంది. ఇప్పటికే రకుల్ కొన్ని సినిమాలను పక్కన పెట్టి మరీ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలను పూర్తి చెయ్యాలని భావిస్తోందట. అయితే ఈ లెక్కన్న వచ్చే ఏడాది ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందేమో ? చూడాలి.