బాలీవుడ్ లో మరో సినిమా చేయబోతున్న రకుల్ ?

Sunday,January 07,2018 - 11:05 by Z_CLU

లేటెస్ట్ గా ‘రారండోయ్ వేడుక చూదాం’,’జయ జానకి నాయక’, ‘స్పైడర్’, ‘ఖాకీ’ సినిమాలతో సందడి చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రెజెంట్ బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టేసింది. ప్రస్తుతం తను నటించిన బాలీవుడ్ సినిమా ‘ఐయారి’ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటూనే మరో వైపు బాలీవుడ్ లో ఇంకో సినిమాకు సైన్ చేసిందట ఈ బ్యూటీ.. లేటెస్ట్ గా రకుల్ అక్షయ్ కుమార్ నటించబోతున్న ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచేసిందనే టాక్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమా కూడా అక్షయ్ కుమార్ గత సినిమాల మాదిరిగానే ఓ విభిన్న రీతిలోనే ఉంటుందని. ఇందులో రకుల్ ఇప్పటి వరకూ కనిపించని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేయబోతుందని సమాచారం. ప్రస్తుతం సూర్య సెల్వరాఘవన్ సినిమాలో నటించడానికి రెడీ అవ్తున్న రకుల్ తన నెక్స్ట్ బాలీవుడ్ సినిమా గురించి ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో…చూడాలి.