రకుల్ రహస్యాలు

Sunday,May 17,2020 - 04:31 by Z_CLU

కొంతమంది ఎప్పుడు చూసిన నవ్వుతూ ఆనందంగా కనిపిస్తారు. అలాంటి వ్యక్తుల్లో రకుల్ ప్రీత్ ఒకరు. తన గ్లామర్ సీక్రెట్ అదేనంటోంది రకుల్. రోజూ ఫ్రెష్ గా, ఆనందంగా ఉండడానికి తను పాటిస్తున్న సీక్రెట్స్ ఏంటో చెబుతోంది.

– ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటాను, నెగెటివ్ ఆలోచనల్ని అస్సలు రానివ్వను
– మంచి ఆహారం తీసుకుంటాను, రెగ్యులర్ గా వ్యాయామం చేస్తాను
– లైఫ్ లో ఎప్పుడూ ప్లాన్-బి ఉండాలి. ఆ విషయంలో నేను ఎప్పుడూ ప్రిపేర్డ్ గా ఉంటాను
– అతిగా ఆనందించడం లేదా బాధపడడం నాకు ఇష్టముండదు… ఇది కూడా ఓ సీక్రెట్
– పని పట్ల అంకితభావంతో ఉంటాను, ఆధ్యాత్మికంగా కూడా ఉంటాను.
– అన్నింటికీ మించి ఆత్మవిశ్వాసంతో ఉంటాను.

వీటన్నింటినీ రెగ్యులర్ గా ఫాలో అవుతాను కాబట్టి తనకు టెన్షన్ ఉండదని, నిత్యం ఆనందంగా ఉంటానని చెబుతోంది.