రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూ

Monday,November 20,2017 - 02:13 by Z_CLU

కార్తీ, రకుల్ జంటగా నటించిన ‘ఖాకీ’ నవంబర్ 17 న రిలీజయింది. అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ లా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్, ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది… అవి మీకోసం…

చాలా హ్యాప్పీగా ఉంది…

ఖాకీ సినిమా రిలీజయింది. అన్ని వైపుల నుండి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగులో ఈ రేంజ్ సక్సెస్ వచ్చిందంటే డెఫ్ఫినేట్ గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలు సక్సెస్ అవుతాయనే కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా హ్యాప్పీగా ఉంది.

కరియర్ లోనే ఫస్ట్ టైమ్…

ఈ సినిమాలో వైఫ్ గా నా క్యారెక్టర్ ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక మిడిల్ క్లాస్ కపుల్ మధ్య ఉండే కెమిస్ట్రీ, దొరికిన ఆ కాస్త టైమ్ ని  వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు.. వాళ్ళిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్… ఎక్కడా బోర్ కొట్టకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు…

 

స్క్రిప్ట్ మ్యాటర్స్….

యాక్టర్స్ లో ఎంత పొటెన్షల్ ఉన్నా, స్క్రిప్ట్ లో స్కోప్ లేకపోతే ఏమీ చేయలేరు… అలాగే ఈ రోజు ఖాకీ లో మా పర్ఫామెన్స్ కి ఇంత అప్లాజ్ వస్తుందంటే డెఫ్ఫినేట్ గా స్క్రిప్ట్ లో దమ్ముంది అని అర్థం…

పోలీస్ పై అభిప్రాయం సినిమాల్ని బట్టి మారదు…

నాది బేసిగ్గా మిలిటరీ బ్యాక్ డ్రాప్ కాబట్టి నాకు డీఫాల్ట్ గానే డిఫెన్స్ పై, పోలీస్ పై రెస్పెక్ట్ ఉంటుంది. ఖాకీ సినిమాకి ముందే పోలీసులు పడే కష్టాలు, వారి రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలుసు… చిన్నప్పుడు నాన్నతో కలిసి 4 రోజులు బంకర్లో గడిపాను, ఫైరింగ్ జరుగుతున్నప్పుడు దగ్గర నుండి చూశాను, టెర్రరిస్టులు మా ఇంటి చుట్టు పక్కలకి రావడం చూశాను.. సో నాకు పోలీస్ అంటే చిన్నప్పటి నుండే చాలా రెస్పెక్ట్…

బిగినింగ్ లో ఆలోచించాను…

ఖాకీలో వైఫ్ క్యారెక్టర్ అనగానే బిగినింగ్ లో ఆలోచించాను. వైఫ్ క్యారెక్టర్ అంటే ఎంతైనా సీనియర్ క్యారెక్టర్ అవుతుంది అని డైలామాలో ఉన్నప్పుడు క్యారెక్టర్ విన్నాను.. ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అవ్వకుండా పెళ్ళి అయ్యే అమ్మాయి క్యారెక్టర్ అదీ.. ఆ క్యారెక్టర్ ని హ్యాండిల్ చేయడం కూడా చాలా క్యూట్ గా ఇంప్రెసివ్ గా ఉంది.. అందుకే ఒప్పుకున్నాను…

కార్తీ ఎక్స్ పెరిమెంటల్ యాక్టర్…

కార్తీ సినిమాలు గమనిస్తే కాష్మోరా, చెలియా, ఇప్పుడు ఖాకీ… తన కరియర్ లో ప్లాన్ చేసుకుంటున్న సినిమాల్లో  ఒక దానితో ఇంకో దానికి సంబంధం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఎక్స్ పెరిమెంట్ చేస్తూనే ఉంటాడు. చాలా డేరింగ్ గా ఉంటాడు. ఈ సినిమా కోసం 3 మంత్స్ రాజస్థాన్ లో ఉండాల్సి వచ్చినపుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు…

 

నాకసలు తెలీదు…

నాకు పోలీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే నాలెడ్జ్ ఉంది కానీ 1995 – 2005 లో జరిగిన ఈ కేస్ గురించి డైరెక్టర్ ఎక్స్ ప్లేన్ చేసేంత వరకు నాకు తెలీదు. వినోథ్ గారు ఈ సినిమా కోసం ఒక్క చిన్న పాయింట్ ని లైట్ తీసుకోకుండా చాలా రీసర్చ్ చేశారు…

న్యూ ఏజ్ అడ్వెంచరస్ మూవీ..  

కార్తీతో ఇంకో సినిమా చేయబోతున్నాను. అది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో బిగిన్ అవుతుంది. అది న్యూ ఏజ్ అడ్వెంచరస్ లవ్ డ్రామా…

ఆయనతో పని చేయడం నిజంగా అదృష్టం…

నీరజ్ పాండే గారు దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ మేకర్స్. ఆయన వెడ్నస్ డే మూవీ, ధోనీ సినిమాలు చాలా ఇష్టం. ఇప్పుడు డైరెక్షన్ లో ‘అయ్యారి’ మూవీలో నటించే చాన్స్ దొరకడం నిజంగా అదృష్టం.

సూర్య గారితో సినిమా…

సూర్య గారితో సినిమా ఇంకా కన్ఫం అవ్వలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. అది ఫైనల్ అయ్యాకే ఏదైనా ఎప్పుడు సినిమా అనేది తెలుస్తుంది…

ప్రస్తుతం సినిమాలివే…

ప్రస్తుతం ‘అయ్యారి’ రిలీజ్ కి రెడీగా ఉంది. తమిళంలో కార్తీ సినిమాతో పాటు ఇంకో సినిమాకు సంతకం చేశాను. తెలుగులో కూడా రెండు సినిమాలున్నాయి. మార్చి కల్లా ఈ సినిమాలు సెట్స్ పైకి వస్తాయి. డీటేల్స్ త్వరలో అనౌన్స్ చేస్తాను…

నయనతారకే అది సాధ్యం…

నేను అప్పుడే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయగలను అని నాకనిపిచడం లేదు. నయనతార వేరు.. తన సినిమాలు చూస్తే, కంప్లీట్ సినిమాను తను క్యారీ చేసే విధానం అమేజింగ్ అనిపిస్తుంది… అదో పెద్ద బాధ్యత. అంత పెద్ద బాధ్యతను ఆక్సెప్ట్ చేయడం నయనతారకే పాసిబుల్…