రకుల్ ప్రీత్ సింగ్ కి అంత సీన్ లేదా..?

Monday,February 11,2019 - 03:27 by Z_CLU

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హీరోయిన్. అందులో అనుమానమే లేదు. సినిమా సక్సెస్ లో మినిమం వాటా రకుల్ ప్రీత్ సింగ్ కి ఉంటుంది. నటించేది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా అందులో రకుల్ స్పేస్ రకుల్ కే. అయితే  ఇదంతా జస్ట్ లైక్ దట్ జరిగిపోతుందా..? లేకపోతే దర్శకులు రకుల్ కి పర్టికులర్ గా ఆ లిబర్టీ ఇస్తున్నారా..?

రకుల్ కరియర్ గ్రాఫ్ గమనిస్తే రిపీటెడ్ డైరెక్టర్స్ ఉంటారు.. రిపీటెడ్ హీరోలు కూడా ఉంటారు. అంతెందుకు ఒక్కోసారి సినిమా సెట్స్ పైనే ఉంటుంది, ఈ లోపు నెక్స్ట్ సినిమాలో కూడా రకులే హీరోయిన్ అని కూడా అనౌన్స్ చేస్తున్నారు హీరోలు. అదీ రకుల్ ప్రీత్ సింగ్. ఒకరకంగా చెప్పాలంటే దర్శకులు రకుల్ కోసం స్పెషల్ గా క్యారెక్టర్స్ రాసుకుంటున్నారు అనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ విషయంలో జెన్యూన్ గా రెస్పాండ్ అయింది రకుల్ ప్రీత్ సింగ్.

‘నాకోసం కథలు, క్యారెక్టర్స్ రాయాలంటే నేను కూడా దీపికా పదుకొనే, కంగనా రనౌత్, అనుష్క శర్మ ల స్థాయికి ఎదగాలి, అప్పుడే అది పాసిబుల్ అవుతుంది. ప్రస్తుతానికి నేను చేయగలిగిందల్లా వచ్చిన ఆఫర్స్ లోంచి బెస్ట్ చూజ్ చేసుకోవడం, అందుకోసం 100% కష్టపడటం.’ అని ముద్దు ముద్దుగా తన వర్కింగ్ స్ట్రాటజీ చెప్పుకుంది.