ఎక్కడా తగ్గట్లేదు రకుల్...!!

Thursday,August 08,2019 - 10:02 by Z_CLU

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అనగానే తడబడకుండా గుర్తుకొచ్చే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ గ్లామరస్ క్వీన్ క్యూట్ హీరోయిన్ ఫేజ్ నుండి మెచ్యూర్డ్ రోల్స్ వరకు, ఏది కొత్తగా అనిపిస్తుందో అది చేస్తూనే పోతుంది. జస్ట్ సాంగ్స్ కోసమే అని కాకుండా హీరోకి సమానంగా ఇంపాక్ట్ నిచ్చే క్యారెక్టర్స్ ని ఎంచుకుంటుంది.

మన్మధుడు 2 : సినిమా జస్ట్ మన్మధుడిదే కాదు… రెంటెడ్ గర్ల్ ఫ్రెండ్ అవంతికది కూడా.. నాగార్జునకి ఈక్వల్ రోల్ లో కనిపించనుంది రకుల్ ప్రీత్ ఈ సినిమాలో. మామూలుగా ఆన్ స్క్రీన్ ప్లే బాయ్స్ లా కనిపించిన హీరోలను చూశాం… కానీ ఈ సినిమాలో ఆల్మోస్ట్ అంతే క్రేజీ క్యారెక్టర్ లో రకుల్ కనిపించనుంది.

ఇండియన్ 2 : ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఎదురు చూసే సినిమా. అలాంటి సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ రోల్ లో కనిపించనుంది రకుల్ ప్రీత్ సింగ్. సిద్ధార్థ సరసన హీరోయిన్ గా ఫిక్సయింది.

నితిన్ 28 : నితిన్ సరసన నటించనుంది. కథలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్ లో కనిపించనుంది ఈ సినిమాలో. సినిమా క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందా..? అనేది ఇప్పుడప్పుడే చెప్పలేం కానీ, రకుల్ మాత్రం క్రిమినల్ లాయర్ రోల్ ప్లే చేయనుంది.

ఇంతేనా..? టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ అని తేడా లేకుండా క్యారెక్టర్ బావుండాలి కానీ సీనియర్ హీరోల సరసన నటించడానికి కూడా ఏ మాత్రం ఆలోచించడం లేదు. రకుల్ సీజన్ నడుస్తుంది మరీ…