NTR బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్

Wednesday,August 08,2018 - 07:43 by Z_CLU

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది NTR బయోపిక్. అయితే ఈ సినిమాలో అతిలోకసుందరి శ్రీదేవిలా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. ఈ విషయాన్ని నిర్మాత విష్ణు ఇందూరి అఫీషియల్ గా కన్ఫమ్ చేశారు.అయితే ఈ సినిమాలో శ్రీదేవి రోల్ ఎలా ఉండబోతుందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు విష్ణు ఇందూరి.

NTR లైఫ్ లోని పొలిటికల్ కరియర్ తో  పాటు సినిమా కరియర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను  ఈ  సినిమాలో హైలెట్ చేయనున్నారు ఫిలిం మేకర్స్. అయితే ఆయన సినిమా కరియర్ కి సంబంధించిన ఒక ఫేజ్ లో NTR, శ్రీదేవి కాంబినేషన్ లో ఉన్న కొన్ని సినిమాలకు సంబంధించిన సన్నివేశాల్లో రకుల్ ఈ సినిమాలో కనిపించనుంది.

క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ NTR రోల్ లో నటిస్తున్నాడు. బాలీవుడ్ నటి విద్యా బాలన్ బసవ తారకం లా కనిపించనుంది. కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.