రకుల్ ప్రీత్ సింగ్ టికెట్ టు బాలీవుడ్

Sunday,June 18,2017 - 04:03 by Z_CLU

ఒక్కసారి టాలీవుడ్ లో సక్సెస్ టేస్ట్ చూశారంటే మెల్లిగా బాలీవుడ్ పై కన్నేసేస్తారు స్టార్ ఇమేజ్ కొట్టేసిన హీరోయిన్స్. ఇది సినిమా ఇండస్ట్రీలో అనాదిగా కొనసాగుతున్న కల్చరే. ఇప్పుడా కల్చర్ ని తూ.చ. తప్పకుండా ఫాలో అయిపోతుంది రకుల్ ప్రీత్ సింగ్.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్రేజీగా కరియర్ ని ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, మెల్లిగా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది. గతంలో ‘యారియాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా, ఎక్స్ పెక్ట్ చేసిన చాన్సెస్ రాకపోయేసరికి బాలీవుడ్ ని టెంపరరీగా లైట్ తీసుకున్న రకుల్, మెల్లిగా మనసు మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

 

గతంలో వెడ్నస్ డే, బేబీ, M.S. ధోనీ సినిమాలకు డైరెక్షన్ చేసిన నీరజ్ పాండే నెక్స్ట్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించారనే టాక్, టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా గట్టిగానే వినిపిస్తుంది. మన భ్రమరాంబ కూడా ఆల్ మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనే అంటున్నాయి సోర్సెస్. మరి అసలు విషయం ఏంటో అఫీషియల్ గా అనౌన్స్ చేస్తేనే కానీ తెలీదు.