మొన్న తమన్న.. ఈసారి రకుల్

Tuesday,December 22,2020 - 04:08 by Z_CLU

మొన్నటికిమొన్న తమన్న కరోనా బారిన పడింది. దాన్నుంచి ప్రస్తుతం ఆమె పూర్తిగా రికవర్ అయి, షూటింగ్ లో పాల్గొంటోంది. ఇప్పుడు రకుల్ కరోనా బారిన పడింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా రకుల్ ప్రీత్ ప్రకటించింది.

ప్రస్తుతం రకుల్ క్వారంటైన్ లో ఉంది. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని ఆమె ఎనౌన్స్ చేసింది. తనతో ఈమధ్యకాలంలో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఆమె రిక్వెస్ట్ చేస్తోంది.

rakul-corona

రీసెంట్ గా క్రిష్ దర్శకత్వంలో సినిమా కంప్లీట్ చేసింది రకుల్. ఆ తర్వాత కుటుంబంతో కలిసి మాల్దీవులు వెళ్లొచ్చింది. త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమా స్టార్ట్ చేయాలి. ఇంతలోనే ఇలా కరోనా బారిన పడింది.