ఇది రకుల్ ప్రీత్ సింగ్ ప్లానింగేనా..?

Saturday,March 23,2019 - 10:08 by Z_CLU

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు చేస్తున్న తెలుగు సినిమాలేంటి…? అట్లీస్ట్ ఫలానా సినిమాకి సంతకం చేసిందన్న దాఖలాలు కూడా కనిపించట్లేదు. అలాగని క్రేజ్ తగ్గింది కాబట్టి సినిమాలు రావట్లేదా..? అంటే అదీ కాదు. ఈసారి బాలీవుడ్ ని కాస్త గట్టిగానే టార్గెట్ చేసిన రకుల్, అజయ్ దేవ్ గన్ సరసన నటిస్తుంది. ఈ సినిమాతో పాటు మరో సినిమాకి కూడా సంతకం చేసినట్టు తెలుస్తుంది.

ఇక తమిళంలో కూడా సూర్య సరసన NGK తో పాటు శివ కార్తికేయన్ సరసన నటించింది. కారణం తెలీదు కానీ తెలుగులోనే కాస్త స్పీడ్ తగ్గించిందీ పంజాబీ భామ. 2018 లో అసలు రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క తెలుగు సినిమా కూడా రిలీజ్ కాలేదు. రీసెంట్ గా మహా అయితే ‘NTR కథానాయకుడు’ లో శ్రీదేవి లా కనిపించిదంతే.

వెంకటేష్, నాగచైతన్య’వెంకీమామ’ కూడా ఆల్మోస్ట్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిక్స్ అనే టైమ్ లో డేట్స్ మ్యానేజ్ అవ్వకపోవడంతో ఆ సినిమా కూడా వదులుకుంది. ఒకేసారి మల్టిపుల్ లాంగ్వేజెస్ పై ఫోకస్ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్, 2019 ని కూడా అంతే ఈజీగా, తెలుగు సినిమా లేకుండానే కానిచ్చేస్తుందా..? లేకపోతే గ్యాప్ అంత మంచిది కాదని రియలైజ్ అయి, కాస్త కష్టంగా నైనా ఈ ఇయర్ తన ప్రెజెన్స్ రిజిస్టర్ చేస్తుందా చూడాలి.