రకుల్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ...

Wednesday,December 14,2016 - 01:41 by Z_CLU

బంగారు భామ రకుల్ మరో హిట్ అందుకుంది.  ఈసారి ఏకంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో బంపర్ హిట్ కొట్టింది. చెర్రీ-రకుల్ హీరోహీరోయిన్లుగా నటించిన ధృవ సినిమా ఓవర్సీస్ లో మిలియన్ క్లబ్ లోకి ఎంటరవ్వడమే కాకుండా.. డొమస్టిక్ గా కూడా బ్రహ్మాండంగా నడుస్తోంది. సో.. రకుల్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. స్టన్నింగ్ బ్యూటీ రకుల్ తో జీ-సినిమాలు ఎక్స్ క్లూజివ్…

* చాలా హ్యాపీ ఫీలవుతున్నా..

ముందు సురేందర్ రెడ్డి గారు ‘తని ఒరువన్’ సినిమా రీమేక్ లో నువ్వే హీరోయిన్ అని చెప్పగానే  హ్యాపీగా ఫీలయ్యా. ఎందుకంటే తని ఒరువన్ తమిళ్ లో వన్ అఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఆ సినిమా రిలీజ్ రోజే చూశా. ఆ సినిమా ఇక్కడ ‘ధృవ’ గా రీమేక్ అవ్వడం గ్రాండ్ హిట్ అవ్వడం వెరీ హ్యాపీ. ఇదొక ఇంటలిజెంట్ ఫిలిం. ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా  అందరినీ ఎంటర్టైన్ చేసేలా సురేందర్ రెడ్డి గారు తెరకెక్కించారు.

* సక్సెస్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా

‘నాన్నకు ప్రేమతో’ ,’సరైనోడు’ ఇప్పుడు ‘ధృవ’ లైన్ గా గ్రాండ్ హిట్స్ అందుకోవడం హీరోయిన్ గా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ‘ధృవ’ షూట్ జరుగుతున్నప్పుడే గ్రాండ్ హిట్ అని టీం అందరం ఫిక్స్ అయిపోయాం.

 rakul-102

*రామ్ చరణ్ మామూలోడు కాడు…

రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ’ తర్వాత వెంటనే మళ్ళీ వర్క్ చేయడం వెరీ హ్యాపీ. చెర్రీ చాలా  నైస్ పర్సన్ , గుడ్ యాటిట్యూడ్. ఈ సినిమా కోసం యాక్టింగ్ గురించే కాకుండా ఫిజిక్ పై కూడా స్పెషల్ కేర్ తీసుకుని సిక్స్ ప్యాక్ చేసి చాలా కష్టపడ్డారు..

*ఆ ముగ్గురితో మరోసారి…

ఈ సినిమా విషయంలో చాలా సర్  ప్రయిజ్ ఫీలయ్యా. ఎందుకంటే  ‘కిక్ 2 ‘ తర్వాత సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ లో చేయడం , అండ్ రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ’ తర్వాత వెంటనే ఈ సినిమాలో నటించడం.. అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ లో ‘సరైనోడు’ తర్వాత వెంటనే ఈ సినిమా చేయడం నిజంగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఈ సినిమా ద్వారా మరో సారి ముగ్గురితో రిపీట్ గా వర్క్ చేశా.

*ఆ సాంగ్ కోసం చాలా కష్టపడ్డా…

ఈ సినిమా లో పరేషాన్ సాంగ్ కోసం కాస్త కేర్ తీసుకొని చాలా కష్టపడ్డాను. సాంగ్ షూట్ జరిగినంత సేపు వాటర్ కూడా తాగకుండా జస్ట్ ఎనర్జీ కోసం అప్పుడప్పుడూ వాటర్ మిలన్ అండ్ కొన్ని ఫ్రూట్స్ మాత్రమే తిన్నాను. ఆ సాంగ్ షూట్ అయిపోగానే సెట్ లో అందరు రకుల్ కి ఫుడ్ పెట్టండి అంటూ అరిచేవారు. ఇప్పుడు ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడం… రకుల్ చాలా గ్లామరస్ గా కనిపించింది అని చెప్తుంటే పడ్డ కష్టంమంతా మర్చిపోయా.

 

*అందుకే డబ్బింగ్ చెప్పలేదు…

‘నాన్నకు ప్రేమ తో’ ,’సరైనోడు’ సినిమాలకు నా క్యారెక్టర్ కి నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. కానీ ధృవ కి ఈసారి డబ్బింగ్ చెప్పలేకపోయా. అందుకు రీజన్ హీరోయిన్ గా బిజీ షెడ్యూలే. వేరే మూవీ షూటింగ్ నుంచి లాంగ్ జర్నీ చేసి వచ్చి డబ్బింగ్ చెప్పాలి. నేను వచ్చి చెప్తా అని అన్నాను. కానీ అరవింద్ గారు ఇబ్బంది పడకు వేరే వాళ్ళ తో చెప్పిద్దాం పర్లేదు అని చెప్పారు. అందుకే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పలేకపోయా.

* మహేష్ సినిమాలో నా క్యారెక్టర్..

ప్రెజెంట్ మహేష్ బాబుతో మురుగుదాస్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాలో నా క్యారెక్టర్ కాస్త డిఫరెంట్ గా ఉంటూ ఎంటర్టైన్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ రాగానే గ్రేట్ ఫీలింగ్ కలిగింది. మహేష్ బాబు గారి తో యాక్ట్ చేయడం సూపర్ ఫీలింగ్.

 rakul-99

*పవన్ గారి తో నటించాలని ఉంది..

పవన్ కళ్యాణ్ గారు వన్ అఫ్ మై ఫెవరేట్ హీరో ఆయనతో నటించే ఛాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా  అని ఎదురుచూస్తున్నా.

* అది నా డ్రీం

నాకు ఫేవరేట్ డైరెక్టట్ అంటే ఠక్కున చెప్పే పేరు రాజమౌళి సార్. ఆయన మేకింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఆయన డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలన్నది నా డ్రీం. అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు కానీ ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా.

*బేసికల్ గా నాకు ఆ జోనర్ అంటే చాలా ఇష్టం

ప్రతి హీరోయిన్ కి ఒక్కో జోనర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా నాకు లవ్ ఎంటర్టైనర్ జోనర్స్ చాలా ఇష్టం. మణిరత్నం సినిమాల్లోలా ఫుల్ లెంగ్త్ లవ్ ఎంటర్టైనర్స్ లో నటించాలని ఉంది.

 rakul-95

* ఆ క్యారెక్టర్ మిస్ అవ్వకూడదని డిసైడ్ అయ్యా

జనరల్ గా సెట్స్ పైకి వెళ్లే ముందు అన్ని కథలు వింటా. లేటెస్ట్ గా కళ్యాణ్ కృష్ణ గారు స్టోరీ చెప్పగానే లైన్ గా సినిమాలు ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యి మరీ డేట్స్ అడ్జెస్ట్ చేసుకున్నా. క్యారెక్టర్ పరంగా  ఆ సినిమా నాకు మరో స్టెప్ అవుతుందని నమ్ముతున్నా.

*ప్రెజెంట్ 5  సినిమాల్లో నటిస్తున్నా

ప్రెజెంట్ హీరోయిన్ గా ఫుల్ బిజీ. 5  సినిమాల్లో నటిస్తున్నా. అందులో మహేష్ బాబు సినిమా, సాయి ధరమ్ తేజ్ సినిమా, నాగ చైతన్య సినిమా, బోయపాటి సినిమాతో  పాటు తమిళ్ లో కార్తీ సినిమాలో నటిస్తున్నా. ఈ సినిమాలతో పాటు విశాల్ తో సినిమాలో నటించబోతున్నాను. ఆ సినిమా ఏప్రిల్-మే లో స్టార్ట్ అవ్వొచ్చు.

* మా బ్రదర్ హీరోగా…

మా బ్రదర్ కి హీరో  అవ్వాలని ఉంది. ప్రెజెంట్ యాక్టింగ్ స్కిల్స్ తో పాటు తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. త్వరలోనే ఎంట్రీ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాడు. చూడాలి ఏం జరుగుతుందో?

 rakul-101

*ఈ ఇయర్ మిస్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యా..

ప్రతి ఏడాదీ ఫ్రెండ్స్ తో న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకుంటా. లాస్ట్ ఇయర్ సినిమా షూటింగ్స్ వల్ల సెలెబ్రేషన్స్ మిస్ అయ్యా. కానీ ఈ ఇయర్ అన్ని షూటింగ్స్ పక్కన పెట్టి మరీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ తో గోవా వెళ్లాలని డిసైడ్ అయిపోయా.