'రకుల్ ప్రీత్ సింగ్' ఇంటర్వ్యూ

Tuesday,February 21,2017 - 05:36 by Z_CLU

ప్రెజెంట్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్ రేస్ లో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ మరో సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది. సాయి ధరమ్ తేజ్ సరసన రకుల్ నటించిన లేటెస్ట్ సినిమా ‘విన్నర్’ ఈ శుక్రవారం థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా ఈ భామ మీడియా తో ముచ్చటించింది. ఆ విశేషాలు రకుల్ మాటల్లోనే…

విన్నర్ లో అలా కనిపించబోతున్నా..

విన్నర్ సినిమాలో నేనొక అథ్లెట్  గా కనిపించబోతున్నా. ఇప్పటి వరకూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ప్రేమ అనే ఆలోచన కూడా లేకుండా ఎప్పటికైనా అథ్లెట్  గా ఓ మెడల్ సాధించడం కోసం ప్రతీ క్షణం తపన పడే సితార క్యారెక్టర్ లో ఎంటర్టైన్ చేయబోతున్నా…

 

పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదు

గోపి గారు ఈ కథ చెప్పగానే అథ్లెట్  గా కనిపించడానికి పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదు. జనరల్ గా జిమ్ లో వర్కౌట్స్ చేయడం నా హాబీ కాబట్టి డైరెక్ట్ గా సెట్స్ పైకి వెళ్ళిపోయా… అక్కడ సీన్స్ కి ముందు జస్ట్ కాస్త వర్కౌట్ చేసుకున్నా అంతే…

 

లక్కీ గా ఫీలవుతున్నా..

ఇప్పటికే ముగ్గురు మెగా హీరోస్ తో నటించా. చరణ్ తో రెండు సినిమాలు చేశా. నిజంగా చాలా లక్కీ గా ఫీలవుతున్నా. కానీ ఆ హీరోలు ఈ హీరోలు అనే ఫీలింగ్ ఉండదు..సినిమా ని సినిమాగానే చూస్తా.. అందరు హీరోలతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది…

 

కమర్షియల్ సినిమా

విన్నర్ కమర్షియల్ సినిమా. చాలా స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉంటుంది. తేజ్ ఈ సినిమా చూసి కన్నీళ్లు తెచ్చుకున్నాడు. ఆడియన్స్ కూడా రేపు అలాగే ఫీలవుతారని నమ్ముతున్నాం. చాలా లావిష్ గా ఉంటుంది. హార్స్ రైడింగ్ తో మంచి ఎంటర్టైనింగ్ గా ఫామిలీ అందరు చూసేలా అనిపిస్తుంది..

 

ఆ సినిమా నుంచి

‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా తర్వాత నుంచి తేజ్ నాకు పరిచయం. నేను సందీప్, రెజీనా, రాశి, తేజ్ మేమందరం క్లోస్ ఫ్రెండ్స్.. ఈ సినిమా చేస్తున్నప్పుడు హీరో హీరోయిన్ అనే ఫీల్ తో వర్క్ చేయలేదు. జస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉంటూ సెట్స్ పై ఎంజాయ్ చేస్తూ హ్యాపీ గా చేసాం.

 

ఆ సినిమాకు కుదిరింది.

ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పలేదు. ఆక్చువల్ గా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఓ లండన్ అమ్మాయి కాబట్టి తెలుగు ప్రనౌన్సేషన్ లో మిస్టేక్ ఉన్నా పరవాలేదు కాబట్టి నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. కానీ మిగతా క్యారెక్టర్ కి చెప్పలేను కదా. అందుకే ఆ ఒక్క సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నా…

 

ఆ ఇద్దరితో మళ్ళీ చేయడం హ్యాపీ.

ఈ సినిమాకి మళ్ళీ డైరెక్టర్ గోపి చంద్ మలినేని తో చోటా గారి తో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. గోపి గారు చాలా కంఫర్టబుల్ డైరెక్టర్. చోటా గారితో నా ఫస్ట్ సినిమా ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ కి వర్క్ చేశా మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆయనతో వర్క్ చేయడం మంచి అనుభూతి కలిగించింది…

 

అస్సలు పట్టించుకోను

లైన్ గా బ్లాక్ బస్టర్ హిట్స్ వస్తున్నాయి. టాప్ పొజిషన్లో ఉన్నారు అంటూ చాలా మంది నాతో అంటుంటారు. కానీ ఆ విషయం అస్సలు పట్టించుకోను. ఒక స్క్రిప్ట్ నచ్చితే షూటింగ్ చేయడం సినిమా అయిపోయాక మరో సినిమా మీద ఫోకస్ పెట్టడం అంతే మిగతావేం పెద్దగా పట్టించుకోను. కానీ హిట్ అయితే హ్యాపీ గా ఫీలవుతా ఫ్లాప్ అయితే కొన్ని క్షణాల్లోనే ఆ విషయాన్ని మర్చిపోయి నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెడతా అంతే….

 

అలా చాలా సార్లు జరిగింది

గతం లో హీరోయిన్ గా కొన్ని పెద్ద సినిమాలు మిస్ అయ్యాను.. కొన్ని సార్లు డేట్స్ అడ్జస్ట్ అవ్వక మరికొన్ని సార్లు రీప్లేస్మెంట్ జరిగాయి. డేట్స్ కుదరకే ‘బ్రహ్మోత్సవం’ సినిమా మిస్ అయ్యా. తమిళ్ లో కూడా ఒక పెద్ద సినిమా మిస్ అయ్యా. ఇలా చాలా సినిమాలున్నాయి. కానీ అవి మిస్ అయినప్పుడు పెద్దగా స్ట్రెస్ ఫీలవ్వలేదు. స్ట్రెస్ ఫీలయ్యి ఏం లాభం ఉండదని నా ఫీలింగ్.. మిస్ అవ్వడానికి ఏదో మంచి రీజన్ ఉందనుకొని అక్కడితో ఆ విషయం వదిలేస్తా..

 

నా క్యారెక్టర్ అలా ఉంటుంది..

ప్రెజెంట్ మహేష్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. హై కాన్సెప్ట్ తో కూడిన థ్రిల్లర్ చాలా ఇంటలిజెంట్ ఫిలిం. ఫన్నీ గా ఉండే ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకూ వరకూ నా క్యారెక్టర్ సంబంధించిన 50 % షూట్ ఫినిష్ అయింది. ఇంకా 50 % ఉంది..

 

మహేష్ ను చూసి చాలా నేర్చుకున్నా

మహేష్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఆయన కూల్ పర్సన్ రియల్ సూపర్ స్టార్ అనిపించింది. ప్రతీ సీన్ గురించి ఎలా చేస్తే బాగుంటుంది అని ట్రే చేస్తూ ఆసక్తి కానబరుస్తారు. ఈ సినిమా చేస్తూ ఆయన ను చూసి చాలా నేర్చుకున్నా..

 

*అదృష్టం గా ఫీలవుతున్నా

ప్రెజెంట్ నాగచైతన్య తో కళ్యాణ్ కృష్ణ  డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాలో నా క్యారెక్టర్ చాలా హోమ్లీగా ఉంటుంది. కచ్చితంగా ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నా. ఈ క్యారెక్టర్ రావడం నా అదృష్టం గా ఫీలవుతున్నా…

 

ఆ సినిమా మార్చ్ లో స్టార్ట్ అవుతుంది.

 నెక్స్ట్ తమిళ్ కార్తీ తో ఓ సినిమా చేయబోతున్నా. ఆ సినిమా మార్చ్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ప్రెజెంట్ అదొక్క సినిమాకే సైన్ చేశా..

 

ఇంకా టైం ఉంది..

లేడి ఓరియెంటెడ్ సినిమా చేయాలనీ ఉన్నా దానికి ఇంకా టైం పడుతుంది. కారణం ఒక హీరోయిన్ గా సినిమాను షోల్డర్స్ పై వేసుకొని ఆడియన్స్ థియేటర్స్ కి తీసుకురావడమనేది చాలా కష్టం..దానికి చాలా ఇమేజ్ కావాలి. ఇంకా నాకు అంత ఇమేజ్ రాలేదని భావిస్తున్నాను. పైగా అలాంటి సినిమాలు చేయమని ఇప్పటి వరకూ నన్ను ఎవ్వరూ అప్రోచ్ అవ్వలేదు కూడా… హీరోయిన్ అయ్యి కేవలం 4 ఏళ్ళే అవుతుంది కదా మంచి కథతో ఎవరైనా అప్రోచ్ అయితే త్వరలో డెఫినెట్ గా చేస్తా…

 

వైజాగ్ లో ఇంకో బ్రాంచ్…

ప్రెజెంట్ హైద్రాబాద్ లో నేను స్టార్ట్ చేసిన జిమ్ బాగా రన్ అవుతుంది. త్వరలోనే వైజాగ్ లో బ్రాంచ్ స్టార్ట్ చేయబోతున్నా.