రిక్షా తొక్కిన రకుల్ ప్రీత్

Tuesday,July 25,2017 - 05:49 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ  బిజీగా ఉంది రకుల్. ఓ వైపు రిలీజ్ కి రెడీ అవుతున్న స్పైడర్, మరో వైపు బోయపాటి జయ జానకి నాయక తో పాటు తమిళంలో కూడా హ్యాండ్ ఫుల్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది అమ్మడు. అయితే ప్రస్తుతం పాండిచ్చేరిలో ఓ తమిళ సినిమా కోసం రిక్షా తొక్కి సోషల్ మీడియాలో హైలెట్ అయింది.

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ సన్నివేశంలో రకుల్ రిక్షా తొక్కాల్సి వచ్చిందట. అయితే రిక్షా తొక్కే విషయంలో రకుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నా, సినిమా యూనిట్ మాత్రం చాలా కంగారు పడిందట. అందుకే రిక్షా సీక్వెన్సెస్ తెరకెక్కించబోయే కార్తీ కూడా రకుల్ రిక్షాలో చాలాసేపు రౌండ్స్ కొట్టాడట.

 

లైఫ్ లో రిక్షా తొక్కుతానని కనీసం కలలో కూడా ఊహించుకోని రకుల్, రిక్షా తొక్కినందుకు ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతూనే, రోజు రిక్షా తొక్కితే స్పెషల్ గా వర్కవుట్ చేయాల్సిన అవసరం ఉండదని స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చేసిందట.