Kondapolam - రకుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Monday,August 23,2021 - 03:27 by Z_CLU

మెగా సెన్సేష‌న్ వైష్ణ‌వ్ తేజ్, క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ `కొండ‌పొలం`. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సోమ‌వారం రోజున‌ ఈ చిత్రంలో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ర‌కుల్ ఈ చిత్రంలో ఓబుల‌మ్మ అనే ప‌ల్లెటూరి అమ్మాయిగా న‌టించింది.

ర‌కుల్ లుక్‌ను రివీల్ చేస్తూ `కొండ‌పొలం` చిత్రం నుంచి ఓ సాంగ్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అడ‌విలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను ప్రేమ‌తో, వెనుక నుంచి వైష్ణ‌వ్ కౌగించుకునే స‌న్నివేశం గ్లింప్స్‌లో క‌నిపిస్తుంది. వైష్ణ‌వ్‌, ర‌కుల్ జోడి స్క్రీన్‌పై ఓ ఫ్రెష్ ఫీల్‌నిస్తుంది. హాఫ్ శారీలో ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ చ‌క్క‌టి పాత్ర చేసిందని అర్థ‌మ‌వుతుంది. సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం.కీర‌వాణి త‌న మ్యూజిక్‌తో మ‌రోసారి మ్యాజిక్ చేశారు.

ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.8గా రూపొందిన అడ్వెంచ‌ర‌స్ మూవీ `కొండ పొలం`కు స‌న్న‌పురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవల ఆధారం. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్‌ జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌రికొంత ప్ర‌ముఖ ఆర్టిస్టులు న‌టించారు. `ఎపిక్ టేల్ ఆఫ్ బిక‌మింగ్‌` అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతోన్న `కొండ‌పొలం` చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు.

RAKUL-FIRST-LOOK-kondapolam

న‌టీన‌టులు:
పంజా వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  క్రిష్ జాగ‌ర్ల‌మూడి
ప్రొడ్యూస‌ర్స్‌:  సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి
బ్యాన‌ర్‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
సంగీతం:  ఎం.ఎం.కీర‌వాణి
సినిమాటోగ్ర‌ఫీ:  జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్‌
క‌థ‌:  స‌న్న‌పురెడ్డి వెంక‌ట రామిరెడ్డి
ఎడిట‌ర్‌:  శ్ర‌వ‌ణ్ క‌టిక‌నేటి
ఆర్ట్‌:  రాజ్ కుమార్ గిబ్స‌న్‌
కాస్ట్యూమ్స్‌: ఐశ్వ‌ర్య రాజీవ్‌
ఫైట్స్‌:  వెంక‌ట్‌